ఏపీలో ప్రభుత్వం మారాలన్నది ప్రజల ఆకాంక్ష అని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహార్ అన్నారు.సమస్యలపైనే పవన్ విమర్శలు చేస్తున్నారన్న ఆయన అవి వ్యక్తిగత విమర్శలు కావని తెలిపారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.ప్రజల డేటాను ఎక్కడికి పంపుతున్నారో ప్రజా ప్రతినిధులు చెప్పాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్లు ప్రభుత్వ కార్యకర్తలు కాదా అని నాదెండ్ల ప్రశ్నించారు.కావాలనే వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.







