కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని మంత్రులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే సురక్ష కార్యక్రమం బాగా జరిగిందన్న ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మరింత మెరుగ్గా సాగాలని సూచించారు.ఈ విధంగానే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల వరకు నేతలు అందరూ నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశించారు.