మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers).టాలీవుడ్ లో ఈ నిర్మాణ సంస్థ ఈ మధ్య కాలంలో చాలా సినిమాల మీద పెట్టుబడులు పెడుతున్నారు.అలాగే ఆ సినిమాల నుండి లాభాలు కూడా పొందుతున్నారు.ఇటీవల కాలంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో లైమ్ లైట్ లోకి వచ్చింది.వరుసగా సినిమాలు చేస్తూ టాప్ లోకి వచ్చేసింది.మరి కొత్త ఏడాది మైత్రి మూవీ మేకర్స్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతుంది.
ఏకంగా 3 వేల కోట్ల రుపాయలను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అయ్యిందట.ఇప్పటికే ఈ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు చాలానే సెట్స్ మీద ఉన్నాయి.పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్31 సినిమా కూడా నిర్మించనున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతూ టాలీవుడ్ లో ఏ సంస్థ చేయనన్ని పాన్ ఇండియన్ సినిమాలు లైన్లో పెట్టారు.
అయితే ఇప్పుడు ఈ సంస్థ మలయాళం( Mollywood) లోకి కూడా అడుగు పెడుతుంది.మలయాళ సూపర్ స్టార్ టోవినో థామస్ తో హై వోల్టేజ్ మాసివ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.ఈ రోజు గ్రాండ్ లాంచ్ జరుగగా ఈ సినిమాను ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ రిలీజ్ చేసారు.120 రోజుల పాటు షూటింగ్ జరగనున్న ఈ సినిమా డిఫరెంట్ లొకేషన్స్ లో తెరకెక్కించనున్నారు.
”నడికర్ తిలకం( Nadikar Thilakam)” అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా యాక్జాన్ గ్రే పెరీరా అలాగే నేహా నైర్ ని సంగీతం అందిస్తున్నారు.కొచ్చిలో అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ మాలీవుడ్ లో అడుగు పెట్టనుంది.చూడాలి ఈ సంస్థ అక్కడ ఎలా రాణిస్తుందో.