టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటీమణులకు అవకాశాలు చూస్తే వాళ్ల కెరీర్ మరో రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.మంచి ఛాన్స్ వస్తే అద్భుతంగా నటించి మెప్పించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు.
కొంతమంది హీరోయిన్లు, నటీమణులు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు.అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అదరహో అనేలా నటించిన వారిలో నవీనా రెడ్డి( Naveena Reddy ) ఒకరు.
ఎలాంటి పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటిస్తూ భవిష్యత్తులో ఇండస్ట్రీలో మరిన్ని సంచలనాలు సృష్టించే విధంగా నవీనా రెడ్డి అడుగులు వేస్తున్నారు.రుద్రంగి సినిమాలో( Rudrangi Movie ) నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె మెప్పించిన తీరు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.
ఈ సినిమాలో తన నటనతో ఆమె ప్రేక్షకులను ఫిదా చేశారు.విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమాలో( Hit Movie ) స్వప్న అనే పాత్రలో నటించిన నవీన రుద్రంగి సినిమాతో ఆ సినిమాను మించి ప్రశంసలు పొందుతున్నారు.
రుద్రంగి సక్సెస్ తర్వాత నవీనా రెడ్డికి ఆఫర్లు పెరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ దర్శకనిర్మాతలకు నవీనా రెడ్డి రూపంలో మంచి నటి దొరికారనే చెప్పాలి.నవీనా రెడ్డి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.ఆచార్య, అఖండ, కస్టడీ, ఆది సాయికుమార్ అతిథి దేవో భవ, ఉప్పెన, అల్లూరి, త్రిశంకు, అర్ధ శతాబ్దం, సగం కథలు సినిమాలలో నటించిన నవీనా రెడ్డికి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
అందం, అభినయంతో మెప్పిస్తున్న ఈ నటికి ఇతర భాషల్లో సైతం ఆఫర్లు వస్తున్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.ఎఫ్2, ఉర్వశివో రాక్షసివో సినిమాల్లో నవీన నటన హైలెట్ గా నిలిచింది.ప్రవాహం -(ఒక చోట ఆగదు) ( Pravaham Oka Chota Agadhu ) అనే సినిమాలో నవీనా రెడ్డి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా స్క్రిప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉందని తెలుస్తోంది.నవీనా రెడ్డి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.