విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా ఏ5 సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరిపింది న్యాయస్థానం.
అనంతరం తదుపరి విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.