ఇటీవల కాలంలో మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఉదాహరణకి పుష్ప సినిమాలో( Pushpa ) అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ ప్రపంచ దేశాలను ఉర్రూతలూగించాడు.
ఈ మూవీలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్( Allu Arjun ) కనబరిచిన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.పుష్పరాజ్ యాక్టింగ్ కి బాగా స్కోప్ ఉన్న మంచి పాత్ర అని చెప్పుకోవచ్చు.
ఇదొక్కటే కాదు ఆర్ఆర్ఆర్ సినిమాలో( RRR ) జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు కూడా నటనకు ఎంతో స్కోప్ ఉన్నవే.
ఈ పాత్రలలో తారక్, చెర్రీ అదరగొట్టారనే చెప్పాలి.
ముఖ్యంగా తారక్ యాక్టింగ్ కు ప్రపంచ స్థాయిలో అవార్డులు ప్రశంసలు దక్కాయి.మన తెలుగు సినిమాల్లోనే కాదు పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో మన్నలను దక్కించుకున్న వారిలో చాలామంది ఇతర భాషా హీరోలూ ఉన్నారు.
ఉదాహరణకు “జైలర్” సినిమాలో( Jailer Movie ) రజనీకాంత్( Rajinikanth ) తన వయసుకు తగ్గ పాత్ర చేసి మెప్పించాడు.ఈ పాత్రలో వీలైనంత ఎక్కువ నటనా ప్రదర్శన కనబరిచే ఛాన్స్ ఉంది.
దానిని రజనీకాంత్ బాగా సద్వినియోగం చేసుకున్నాడు.ఈ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కూడా అందుకున్నాడు.

లియో ( Leo ) సినిమాలో దళపతి విజయ్, విక్రమ్( Vikram ) సినిమాలో కమల్ హాసన్, జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఇలా చెప్పుకుంటూ పోతే ఈ హీరోలందరూ కూడా ఇటీవల కాలంలో సాలిడ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచి వందల వేల కోట్లు బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టారు.మొత్తం మీద ఈ హీరోలు కోట్ల కోసం వచ్చిన సినిమాని ఒప్పుకోకుండా పర్ఫామెన్స్ ఉన్న సినిమాను మాత్రమే ఒప్పుకొని తమ సత్తా చాటుకున్నారు.

పేరుని చూసి మిగతా హీరోలు కూడా నటనకు స్కోప్ ఉన్న మెయిన్ లీడ్ రోల్స్ కోసం అన్వేషిస్తున్నారు.పారితోషికం గురించి అసలు ఆలోచించకుండా మంచి కథ డైరెక్టర్ దొరికితే వెంటనే ఓకే చెప్పేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు.ఛాన్స్ ఇస్తే చాలు పర్ఫామెన్స్ ఇరగదీస్తామని అంటున్నారు.మరి భవిష్యత్తులో ఎలాంటి సాలిడ్ పర్ఫామెన్స్ లతో టాలీవుడ్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.అలాగే రొటీన్ సినిమాలు తీస్తూ నిరాశ పరుస్తున్న హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో కూడా చూడాలి.