ఎంఈఐటిసవై (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ) సోషల్ మీడియా సంస్థలకు తాజాగా వార్నింగ్ నోటీసులు జారీ చేసింది.ముఖ్యంగా ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, టెలిగ్రామ్( X (Twitter), YouTube, Telegram ) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ విషయంలో ఈ వార్నింగ్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్( Child sexual abuse material ) (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించింది.అంతే కాకుండా భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను అమలు చేయాలని సూచించింది.

ఈ నియమాలనుగాని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ప్రకటనలో తెలిపింది.ఒకవేళ దీనిని ఉల్లంఘిస్తే.సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్( Rajeev Chandrasekhar ) ఈ సందర్బంగా హెచ్చరించారు.ఐటీ నిబంధనల ప్రకారం సురక్షితమైన, విశ్వసనీయమైన ఇంటర్నెట్ ను రూపొందించడానికి ప్రభుత్వం మనసా వాచా కర్మణా కట్టుబడి ఉందని, ఇటువంటి చర్యలు ఉల్లంఘనకు ప్రభుత్వం ఎంతదూరం అయినా వెళుతుందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా సోషల్ మీడియా మధ్యవర్తులు తమ ప్లాట్‌ఫారమ్‌లలో క్రిమినల్ లేదా హానికరమైన పోస్ట్ లను నిషేధించే ఐటి చట్టంలో నిర్దేశించిన కఠినమైన అంచనాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని, ఆయా రూల్స్ ఒకసారి చదివి తెలుసుకోవాలని ఈ నేపధ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు.వాటిని ఉల్లంఘిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 79ప్రకారం, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నొక్కి మరీ చెప్పారు.ఇక ఏమధ్య కాలంలో చూసుకుంటే ఆన్లైన్ మాధ్యమాలను వాడుకొని కొంతమంది దుండగలు అసాంఘిక కార్యకలాపాలను చేస్తూ పేట్రేగిపోతున్నారు.కాబట్టి అటువంటి వారిని నియంత్రించే బాధ్యత ఆయా సోషల్ మీడియాలదేనని చెప్పుకొచ్చారు.