మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం.భారత దేశం అన్ని మతాలు, కులాల వేదిక.
దేశములోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదు.భారత దేశాన్ని విచ్చినం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదను కొందరి చేతుల్లో పెడ్తున్నరు.దేశంలో కాంగ్రెస్ పార్టీ లేవలేని స్థితిలో ఉంది.
దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ శూన్యతను గుర్తించి కేసీఆర్ జాతీయ పార్టీని పెడుతున్నాడు.దేశంలోనే విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ.
బిజెపి కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పుతున్నడు.దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని రెచ్చిపోతున్నరు.దేశాన్ని దోచుకోవడమే పనిగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది.కేసీఆర్ నిర్ణయానికి అనేక పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి.
గిరిజన రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసినా, కేంద్రంలో బీజేపీ ఆమోదం తెలపడం లేదు.తండాలను, గూడెంలను పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ ది.గిరిజన యూనివర్సిటీ కోసం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించినా నేటి వరకు కేంద్రం నిధులు ఇవ్వలేదు.ఇకనుండి దేశంలో కొత్త రాజకీయాలు రాబోతున్నాయి.







