తెలంగాణా లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో కూడా క్రమక్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే రెండోసారి కూడా లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు.

 Telangana, Corona Cases, Ap, Corona Positive Cases, Narendra Modi-TeluguStop.com

అయితే ఏప్రిల్ 20 వరకు కూడా కఠిన నిబంధనలతోనే లాక్ డౌన్ ను అమలు పరచాలి అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు.ఈనెల 20 వరకు భారత్ కు గడ్డుకాలం అని మోడీ హెచ్చరించారు కూడా.

అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే తెలంగాణా లో నమోదవుతున్న కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.మంగళవారం వరకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండగా బుధవారం విడుదల అయిన బులిటెన్ ప్రకారం కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయినట్లు మంగళవారం వరకు పదుల సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

అంతేకాదు.
బుధవారం రోజు కరోనాను జయించి.

మరో 8 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వీరిలో 118 మంది కరోనా నుంచి బయటపడ్డారు.మరో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 514 యాక్టివ్ కేసులున్నాయి.అయితే వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 267 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దీంతో రాష్ట్రంలో ఉన్న మొత్తం కేసుల్లో సగానికి పైగా నగరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.మరోపక్క ఏపీలో మరో తొమ్మిది మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది.

Telugu Corona, Narendra Modi, Telangana-

నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలలో 3, కర్నూలులో 3 కేసులు నమోదవ్వడం తో మొత్తం కేసుల సంఖ్య 534కు చేరింది.అందులో 20 మంది డిశ్చార్జి కాగా, 14 మంది మరణించారు.ప్రస్తుతం 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.జిల్లాల వారీగా చూస్తే.అనంతపూర్‌లో 21, చిత్తూరులో 23, తూర్పు గోదావరిలో 17, గుంటూరులో 122, కడపలో 36, కృష్ణాలో 48, కర్నూలులో 113, నెల్లూరులో 58, ప్రకాశంలో 41, విశాఖపట్నంలో 10, పశ్చిమ గోదావరిలో 34 కేసులు నమోదు కాగా.శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube