టిఆర్ఎస్ ఎంపీ ' నామా ' ఇంట ఈడీ సోదాలు ! బీజేపి మీటింగ్ ఎఫెక్టా ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది.ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.

 Enforcement Officers Search Nama Nama Nageswararaos House And Office, Nama Nages-TeluguStop.com

హైదరాబాదులోని నామా నాగేశ్వరరావు ఇంట్లోనూ ఆయన కార్యాలయాల్లోనూ ఈ సోదరులను అధికారులు నిర్వహిస్తున్నారు.బ్యాంకులో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని విదేశీ కంపెనీలకు మళ్లించారు అనే అభియోగాలపై నాగేశ్వరరావు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ పేరుతో ఆయన బ్యాంకులలో 1064 కోట్ల రుణాలు తీసుకుని నిధులను మరణించినట్లుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.వాస్తవంగా మధుకాన్ సంస్థ పై 2019లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఇప్పుడు ఆ కేసు ఆధారంగానే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.ఖమ్మం ఎంపీగా ఉన్న నామ నాగేశ్వరావు లోక్ సభ లో టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు.

అయితే ఒక్క సారిగా ఈ వ్యవహారం పై అధికారులు దృష్టి పెట్టడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.టిఆర్ఎస్ విషయంలో సానుకూలంగా ఉండకూడదని బీజేపీ కీలక సమావేశంలో నిన్ననే  నిర్ణయించుకున్నారు.

తెలంగాణ బిజెపి నాయకులతో పాటు , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ వంటి నేతలు హాజరైన సందర్భంగా టిఆర్ఎస్ విషయంలో సానుకూలంగా ఉంటే ప్రజలలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని, టిఆర్ఎస్ విషయంలో కఠిన వైఖరితో ఉండాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు నామా నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు నిర్వహించడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.

Telugu Bjp, Cbi Enquiry, Directorate, Khammam Trs Mp-Telugu Political News

ప్రస్తుతం నామా నాగేశ్వరరావు వ్యవహారం జస్ట్ శాంపిల్ మాత్రమే అని, ముందు ముందు మరిన్ని దర్యాప్తులు, సోదాలు టీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా  జరుగుతాయి అనే  సంకేతాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం ఈ వ్యవహారం అధికార పార్టీ టిఆర్ఎస్ లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube