టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజకీయ అజ్ఞాని బండి సంజయ్ అని విమర్శించారు.
ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై కనీస అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని తెలిపారు.టీఎస్పీఎస్సీ ప్రభుత్వ శాఖ కాదన్న మంత్రి కేటీఆర్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని పేర్కొన్నారు.
దీనిపై బండి సంజయ్ కు కనీస అవగాహన లేదని స్పష్టం చేశారు.నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని వెల్లడించారు.







