అగ్ర రాజ్యం అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు జులై 4.ఈ రోజును అమెరికా ప్రజలు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు.
పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఓ పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమానికి ఎంతో గుర్తింపు కూడా ఉంటుంది.అమెరికా ప్రభుత్వం ఈ రోజున అధికారిక కార్యక్రమాలు సైతం భారీ స్థాయిలో నిర్వహించడం ఆనవాయితీ.
అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జులై 3 న భారీ ర్యాలీ చేపట్టడానికి సిద్దమయ్యారు.ఈ విషయాన్ని ఆయనే మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు.
ఎన్నికల సమయంలో ట్రంప్ “సేవ్ అమెరికా” అనే నినాదంతో ప్రచారాన్ని చేపట్టన విషయం విధితమే ఇప్పుడు కూడా అదే నినాదంతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడానికి సిద్దమయ్యారట.ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
ప్రస్తుతం అమెరికా దీన స్థితిలో ఉంది.మనం మన అమెరికాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందరూ కదిలిరండి అంటూ అమెరికాను కాపాడుకుందాం అంటూ ప్రకటించారు.

జులై 3 తేదీ రాత్రి 8 గంటల నుంచీ అర్ధరాత్రి వరకూ ఈ ర్యాలీ జరుగుతుందని ట్రంప్ సొంత రాష్ట్రమైన ఫ్లోరిడాలో ఈ ర్యాలీ చేపట్టనున్నారని ట్రంప్ వర్గం ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని రిపబ్లికన్ ఆఫ్ ఫ్లోరిడా చేపడుతోందని అందుకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చుతుందని తెలుస్తోంది.ఇదిలాఉంటే ఎన్నికల సమయంలో ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ తన వర్గం వారిని రెచ్చగొట్టడంతో అమెరికా క్యాపిటల్ పై దాడి జరిగి కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
అప్పట్లో ఈ ఘటన అమెరికా చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించబడింది.ఇప్పుడు కూడా ఇదే తరహాలో ర్యాలీ జరుగుతుందేమో అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని కూడా అమెరికన్స్ వ్యక్తం చేస్తున్నారు.