తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ తరువాత తానే సీనియర్ నేతనని తెలిపారని సమాచారం.
సుమారు 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా తన ప్రస్థానం కొనసాగుతుందన్న ఆయన తనంత సీనియర్ రాష్ట్రంలో ఎవరూ లేరని పేర్కొన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
మొదటిలో టీడీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లు చెప్పారు.కసితోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా ఎర్రబెల్లి గెలుపొందిన విషయం తెలిసిందే.







