దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఐఏఎస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరుగా దండెత్తుతు న్నారు.ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, రైతుల నుంచి భూములు లాక్కోవడం, అగ్రి గోల్డ్ మోసం వంటి విషయాలను వారు నేరుగా ప్రస్తావిస్తూనే.
బాబుపై రాళ్లు వేస్తున్నారు.ఇవి నిజాలేనా? అని అనిపించే స్థాయిలో వారు చేస్తున్న విమర్శలను మొదట్లో రాజకీయంగా ఎవరి ప్రోత్సాహంతోనే చేసి ఉంటారని అందరూ భావించారు.అయితే, రాను రాను.అధికారుల సంఖ్య పెరుగుతుండడం, వారు చేస్తున్న విమర్శల స్థాయి కూడా పుంజుకోవడం వంటి పరిణా మాలను గమనిస్తే.దీనికి రీజన్ ఏంటా? అనే ప్రశ్న తెరమీదికి తెస్తోంది.

ఏపీ విభజన తర్వాత రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు.అనూహ్యంగా చంద్రబాబును టార్గెట్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.ఆయన రాజధాని అమరావతి నుంచి అగ్రిగోల్డ్ సహా రైతుల భూముల విషయంలోనూ విమర్శలు సంధించారు.
అంతేకాదు, ఇటీవల రాజధాని అవసరమా? అంటూ పుస్తకం కూడా రాశాడు.అయితే, ఈ విమర్శలను, పుస్తకాన్ని కూడా టీడీపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టి.
ఐవైఆర్.వైసీపీతో అంటకాగుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి తొలగించిన నాటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని ఆయనపై విరుచుకుపడుతున్నారు.ఇదిలావుంటే, తాజాగా చంద్రబాబు పనితీరుపై మరో మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నా రని కల్లాం ఆరోపించారు.అమరావతిలో అవినీతికి సంబంధించి తానో పుస్తకం రాశానన్న ఆయన మరో సంచలనానికి వేదిక అయ్యారు.
మహానగరాల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది.ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదు.
పైగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం సరైన భావనకాదు.విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాలి.
అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయింది.
దీనివల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది.నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే.
రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నారు అని బాబుపై విరుచుకుపడ్డారు.ఇదిలావుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్కు లేఖ రాయడం సంచలనంగా మారింది.రాజధాని ఎంపికకు ముందే అదే ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ భూములు కొనడం వెనుక భారీ అవినీతి ఉందని శర్మ చెప్పారు.
ఇలా.మాజీ అధిపతులు.బాబుపై దండెత్తుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.నిజానికి వీరికి రాజకీయాలతో సంబంధం లేదు.అయినా కూడా వీరు బాబును తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు.మరి వీరి ఉద్దేశం ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు!
.