ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది అధిక రక్తపోటుతో( High BP ) బాధపడుతున్నారు.హై బ్లడ్ ప్రెజర్ కారణంగా తీవ్రమైన తలనొప్పి, దృష్టి లోపం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలు తలెత్తుతాయి.
అందువల్ల అధిక రక్తపోటును అదుపులోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యం.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా తోడ్పడతాయి.
ఇప్పుడు చెప్పబోయే లడ్డూ కూడా ఆ కోవకే చెందుతుంది.ఈ లడ్డూను( Laddu ) రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే అధిక రక్తపోటుకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.
లడ్డూ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలు,( Pumpkin Seeds ) అర కప్పు అవిసె గింజలు,( Flax Seeds ) పావు కప్పు నువ్వులు( Sesame Seeds ) విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పది నుంచి పదిహేను గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ లో వేయించుకున్న గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి చేతి సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసి మరోసారి కలుపుకుని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.
ఈ లడ్డూలను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను తీసుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు.ముఖ్యంగా ఈ లడ్డూలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి, ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి.అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.
అలాగే ఈ లడ్డూలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఇది మలబద్ధకం నుండి ఉపశమనం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఈ లడ్డూలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
అంతేకాకుండా ఈ లడ్డూలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది, ఇది మంచి నిద్రను ప్రోత్సహించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.