పిజ్జా కోసం వెళ్లిన సిస్టర్స్ అదృశ్యం.. 50 ఏళ్లకు ఎవిడెన్స్ కోసం సెర్చ్..?

తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలి పెట్టకూడదు.లేదంటే దుర్మార్గులు వారిని టార్గెట్ చేసి చివరికి దారుణాలకు పాల్పడే ప్రమాదం ఉంది.1975లో 10 ఏళ్ల కేథరిన్‌,( Katherine ) 12 ఏళ్ల షీలా లియోన్‌లకు( Sheila Lyon ) ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్క పేరెంట్ కూడా షాక్ అయిపోతాడు.ఈ బాలికలు తమ పుట్టిన రోజులకు ముందు, మేరీల్యాండ్‌లోని(Maryland ) ఓ పిజ్జా కేంద్రానికి వెళ్లారు.

 Nearly 50 Years Ago The Lyon Sisters Vanished In Virginia After Heading To The M-TeluguStop.com

పిజ్జా తినడానికి వెళ్లిన కేథరిన్‌, షీలా లియోన్‌లు ఇంటికి తిరిగి రాలేదు.వారి తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వాషింగ్టన్ డి.సి. ప్రాంతంలో భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టబడింది.డైవర్లు, విమానాలు, పోలీస్ కుక్కలను ఉపయోగించి విస్తృతంగా వెతికినప్పటికీ, ఆ అమ్మాయిలు దొరకలేదు.

Telugu Remains, Katherine Lyon, Lloyd Lee Welch, Lyon Sisters, Sheila Lyon, Tayl

42 ఏళ్ల పాటు ఈ కేసు పరిష్కారం కాకుండా ఉండిపోయింది.2013లో, ఫైళ్లను మళ్లీ పరిశీలిస్తున్నప్పుడు, పోలీసులకు లాయిడ్ లీ వెల్చ్ జూనియర్( Lloyd Lee Welch Junior ) అనే 18 ఏళ్ల వ్యక్తి గురించి కొన్ని నోట్స్ దొరికాయి.ఆ అమ్మాయిలు అదృశ్యమైన వెంటనే ఈ వ్యక్తిని అనుమానించి ప్రశ్నించారు.

వెల్చ్‌కు ఇంకో కేసులో జైలు శిక్ష పడింది, అయితే లియోన్ సోదరీమణులను అపహరించి, వారిపై అత్యాచారం చేశానని ఆపై చంపేసానని అతను ఒప్పుకున్నాడు.తన మామయ్య బేస్‌మెంట్‌లో వారి శరీరాలను కాల్చివేసి, వర్జీనియాలోని తమ కుటుంబ భూమిలో పాతిపెట్టానని వెల్లడించాడు.

Telugu Remains, Katherine Lyon, Lloyd Lee Welch, Lyon Sisters, Sheila Lyon, Tayl

అదనంగా చేసిన శోధనలో చిన్న చిన్న ఎముక ముక్కలు, ఒక పన్ను, ఆ అమ్మాయిలకు చెందినదేమో అని అనుమానిస్తున్న జువెలరీ లభించాయి.వెల్చ్‌ ఇచ్చిన సమాచారంలో కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, అతనిపై ఆరోపణలు మోపారు.2017లో ఆ అమ్మాయిలను హత్య చేసిన నేరాన్ని అతను అంగీకరించాడు.దీంతో న్యాయస్థానం అతనికి 48 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఆ అమ్మాయిల శరీరాలను ఇప్పటికీ పోలీసులు కనిపెట్టలేకపోయారు.దశాబ్దాలుగా ఆ డెడ్ బాడీస్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

కొత్త ఎవిడెన్స్ కోసం చాలా ట్రై చేస్తున్నారు.ప్రస్తుతం వర్జీనియాలోని టేలర్స్ మౌంటెన్ ప్రాంతంలో అధికారులు సెర్చ్ ఆపరేషన్ మళ్ళీ మొదలు పెట్టేసారు.50 ఏళ్ల తర్వాత వారి పాటికి సంబంధించిన ఏదో ఒక ఎవిడెన్స్ కనిపెట్టి ఈ కేసులో క్లోజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube