సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు రాలిపోతుంటే ఎంత బాధ కలుగుతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
జుట్టు రాలడానికి అనేక అంశాలు కారణం అవుతాయి.అయితే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు మన ఇంటి బయట ఉండే మందారం పువ్వులు( Hibiscus ) అద్భుతంగా తోడ్పడతాయి.
మందారంతో ఇప్పుడు చెప్పబోయే విధంగా మాస్క్ కనుక వేసుకుంటే ఈజీగా హెయిర్ ఫాల్ సమస్యకు బై బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు ఫ్రెష్ మందారం పువ్వులు వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ మందారం హెయిర్ మాస్క్( Hibiscus Hair Mask ) కురుల ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.మందారం స్కాల్ప్ కు రక్త ప్రసరణను పెంచుతుంది.జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది.జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
మందారం శిరోజాలను హైడ్రేట్ చేస్తుంది.మరియు పొడి, నిర్జీవంగా ఉన్న జుట్టును రిపేర్ చేస్తుంది.మందారం జుట్టు మూలాలను బలపరుస్తుంది.
జుట్టును మెరిసేలా మరియు ఆరోగ్యవంతంగా చేస్తుంది.అలాగే పెరుగు, అలోవెరా జెల్, విటమిన్ ఈ ఆయిల్, నువ్వుల నూనె కూడా జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
కురులను స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా మారుస్తాయి.కాబట్టి అధిక హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు ఇప్పుడు చెప్పుకున్న మందారం మాస్క్ ను తప్పకుండా ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.