బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో తర్వాత వరుస అవకాశాలతో బిజీ అవుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా.? అంటే మోనాల్ మాత్రమేనని చెప్పాలి.బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు 15 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ మొత్తం 15 లక్షల కంటే చాలా ఎక్కువని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మోనాల్ కు షాప్ ఓపెనింగ్ ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయని ఈ ఆఫర్లకు కూడా మోనాల్ లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను సరిగ్గా వాడుకోవడంలో మోనాల్ సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను మోనాల్ బాగా ఫాలో అవుతున్నారు.స్టార్ మా ఛానెల్ లోనే ఒక షోకు మోనాల్ జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఒకవైపు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ డిమాండ్ కు తగిన స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ మోనాల్ గతంతో పోలిస్తే బిజీ అవుతున్నారు.మోనాల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు సైతం అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.వరుసగా ఆఫర్లు వస్తూ ఉండటంతో హైదరాబాద్ లో మోనాల్ ఒక ఇల్లు కూడా కొనబోతున్నారని తెలుస్తోంది.
14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన మోనాల్ వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలను దక్కించుకుంటూ ఉండటం గమనార్హం.
మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా తమకు ఆఫర్లు వస్తున్నాయని చెబుతున్నా మోనాల్ స్థాయిలో వాళ్లు బిజీ కాకపోవడం గమనార్హం.