బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )రాబోయే తెలంగాణ ఎన్నికలపై ధీమాగానే ఉన్నారు.టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మొదటిసారిగా జరగబోతున్న ఎన్నికలు కావడంతో వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇప్పటికే రెండుసార్లు వరుసగా పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే దేశవ్యాప్తంగా ప్రభావం చూపించగలము అని కెసిఆర్ నమ్ముతున్నారు.ఇక అన్ని అనుకున్నట్లయితే ఈ అక్టోబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని కేసీఆర్ పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు తెలిపారు.
డిసెంబర్ వరకు ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ, అక్టోబర్ లోనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుందని కెసిఆర్ అంచనా వేస్తున్నారు.

ఈ మేరకు ఆగస్టులోనే ఎన్నికల నోటిఫికేషన్ విలువడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉంటే మూడోసారి బిఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందనే నమ్మకంతో కెసిఆర్ ఉన్నారు.అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై( Welfare Schemes ) సంతృప్తితో ఉన్నాయని, బిజెపి, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అంతేకాకుండా తెలంగాణలో బిజెపి బలపడినా, కాంగ్రెస్ బిజెపి మధ్య ఓట్ల చీలిక వచ్చి తమ గెలుపునకు మార్గం సులువుతుందని నమ్ముతున్నారు.
అయితే కేసీఆర్ అంచనా వేస్తున్నట్లుగా గెలుపు పై అంత ధీమా వ్యక్తం చేస్తున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం అంత ఆషామాషీగా లేవు.

ఇప్పటికే అనేక సర్వే సంస్థలు తెలంగాణ ఎన్నికలపై సర్వే చేపట్టగా, కెసిఆర్ అనుకున్నంత స్థాయిలో బీఆర్ఎస్( BRS party ) కు ఆదరణ లేదనేది తేలింది.అనేక విషయాల్లో ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తితో ఉన్నారనే విషయం తేలింది.ముఖ్యంగా రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడం, దళిత బంధు కొంతమందికి మాత్రమే అందడం, నిధుల కొరతతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పడుతూ జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడడం, సంక్షేమ పథకాలకు సరైన బడ్జెట్ కేటాయించలేకపోవడం, ఆ ప్రభావంతో ప్రజలకు అనుకున్న మేర సంక్షేమ ఫలాలు అందకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని నివేదికలు బయటకు వచ్చాయి.

అంతేకాకుండా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అసంతృప్తి పెరగడం, నిరుద్యోగుల సంఖ్య పెరగడం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం , టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ( TSPSC Paper Leakage ) వ్యవహారం వంటివి ఎన్నో బీఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తి పెంచాయి.దీంతో ఈసారి బీఆర్ఎస్ క్యాబినెట్ లోని మంత్రులు చాలామంది గెలిచే అవకాశం లేనట్లుగా సర్వేల్లో తేలిందట.దీంతో కెసిఆర్ అనుకున్నంత స్థాయిలో గెలుపు అవకాశాలు లేవనే విషయం బీఆర్ ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.







