Sai Pallavi : ఆ సినిమా తర్వాత భయమేసి జార్జియా వెళ్ళిపోయాను : సాయి పల్లవి

సాయి పల్లవి( Sai pallavi )… చాలా మంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని చెప్తూ ఉంటారు కానీ నిజమైన డాక్టర్ అయిన సాయి పల్లవి నటిగా అవ్వాలని మాత్రం ఏ రోజు అనుకోలేదు.ఎంతో చక్కగా డాన్స్ చేయగలిగే సాయి పల్లవి డి వంటి రియాల్టీ షోలో( D reality show ) సైతం పాల్గొని ఆ తర్వాత ఆమె ఇంటర్ అయిపోగానే మెడిసిన్ చేయడానికి జార్జియాకి( Georgia ) వెళ్ళిపోయింది.

 Sai Pallavi About Her Face And Body-TeluguStop.com

తన చిన్నతనం నుంచి త్రిష సిమ్రాన్ లాంటి వారిని చూసి పెరిగానని, వారిలాగా అందమైన బాడీ తనకు లేదని వారిలాగా తను అందగత్తెను కాదని ఎప్పటికీ అప్పుడు తనకు తాను సర్ది చెప్పుకునే దానిని అంటూ ఓసారి మీడియాతో సాయి పల్లవి తెలిపింది.

Telugu Sai Pallavi-Telugu Stop Exclusive Top Stories

జార్జియాలో సైతం చుట్టూ ఉండే జనాలు చాలా తెల్లగా ఉంటారని ఇక వారిలాగా నాకు తెలుపు రంగు రాలేదని అలాగే నా మొహం అంతా కూడా పింపుల్స్ ఉంటాయని నన్ను ఎవరు ఇష్టపడరు అని అనుకుంటూ ఉండే దానిని అంటూ తెలిపింది సాయి పల్లవి.అయితే అల్ఫొన్స్ ప్రేమమ్ సినిమా కోసం తనను పిలిచినప్పుడు జార్జియా నుంచి చాలా నర్వస్ గా వచ్చానని అసలు సినిమా ఇండస్ట్రీ తనకు ఏ మాత్రం సూట్ కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని అంటూ తెలిపింది.ఇక ప్రేమమ్ సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు చేసి ఆ సినిమా విడుదల అవ్వక ముందే తాను జార్జియా వెళ్ళిపోయానని విడుదలైన రోజు ఖచ్చితంగా అందరూ నన్ను బాగా తిట్టుకుంటూ ఉంటారని ట్విట్టర్ కూడా చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది.

Telugu Sai Pallavi-Telugu Stop Exclusive Top Stories

కానీ విడుదలైన తర్వాత అన్న పింపుల్స్ మొహాన్ని అందరూ ఇష్టపడ్డారని, సిమ్రాన్ లాగా, త్రిష లాగా తనకు ఫిగర్ లేకపోయినా నన్ను ఒప్పుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, నేచురల్ గా ఉండే మన ఇండియన్ కలర్ ని మన వారందరూ ఇష్టపడతారని అప్పుడే తెలుసుకున్నానని, నన్ను నన్నుగా ప్రేమిస్తున్న వారందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పింది సాయి పల్లవి.సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది.ఆమె డేట్స్ కోసం ఎంతోమంది అమే ఇంటి ముందు క్యూ కడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube