గుంటూరు కారంలో మీనాక్షి ఫిక్స్... అసలు విషయం చెప్పేసిన నటి!

త్రివిక్రమ్( Trivikram )- మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా గుంటూరు  కారం( Gunturu Kaaram ).ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులు ప్రారంభించుకున్నప్పటికీ ఇప్పటివరకు 50% షూటింగ్ కూడా పూర్తి కాలేదు పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది.

 Meenakshi's Fix In Guntur Karam, Meenakshi Chowdary, Sreeleela ,mahesh Babu ,tr-TeluguStop.com

అయితే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మొదట్లో పూజ హెగ్డే (Pooja Hedge) హీరోయిన్ గా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వెల్లడించారు.అయితే పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ను తీసుకున్నారంటు వార్తలు వచ్చాయి.

Telugu Gunturu Kaaram, Hatya, Mahesh Babu, Sreeleela, Tollywood, Trivikram-Movie

ఈ విధంగా గుంటూరు కారం సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే తాజాగా ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) ఫిక్స్ అయినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు.విజయ్ ఆంటోనితో కలిసి మీనాక్షి చౌదరి నటించిన హత్య సినిమా త్వరలోనే విడుదల కానుంది .దీంతో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా గురించి అసలు విషయం వెల్లడించారు.గుంటూరు కారం సినిమాలో పనిచేయడం చాలా గొప్పగా ఉందని ఈమె తెలియజేశారు.

Telugu Gunturu Kaaram, Hatya, Mahesh Babu, Sreeleela, Tollywood, Trivikram-Movie

తాను మహేష్ బాబుకి వ్యక్తిగతంగా పెద్ద అభిమానిని అలాంటిది మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం మహేష్ బాబు తో కలిసి మొదటి రోజు షూటింగ్లో పాల్గొన్నటువంటి ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.గుంటూరు కారం సినిమా విషయంలో తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .ఈమె ఈ విషయాలను వెల్లడించడంతో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యారని తెలుస్తోంది.ఇక మరొక హీరోయిన్ పాత్రలో శ్రీ లీల( Sreeleela ) నటిస్తున్న సంగతి తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube