గుంటూరు కారంలో మీనాక్షి ఫిక్స్… అసలు విషయం చెప్పేసిన నటి!

త్రివిక్రమ్( Trivikram )- మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా గుంటూరు  కారం( Gunturu Kaaram ).

ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులు ప్రారంభించుకున్నప్పటికీ ఇప్పటివరకు 50% షూటింగ్ కూడా పూర్తి కాలేదు పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మొదట్లో పూజ హెగ్డే (Pooja Hedge) హీరోయిన్ గా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వెల్లడించారు.అయితే పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ను తీసుకున్నారంటు వార్తలు వచ్చాయి.

"""/" / ఈ విధంగా గుంటూరు కారం సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) ఫిక్స్ అయినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు.

విజయ్ ఆంటోనితో కలిసి మీనాక్షి చౌదరి నటించిన హత్య సినిమా త్వరలోనే విడుదల కానుంది .

దీంతో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా గురించి అసలు విషయం వెల్లడించారు.

గుంటూరు కారం సినిమాలో పనిచేయడం చాలా గొప్పగా ఉందని ఈమె తెలియజేశారు. """/" / తాను మహేష్ బాబుకి వ్యక్తిగతంగా పెద్ద అభిమానిని అలాంటిది మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం మహేష్ బాబు తో కలిసి మొదటి రోజు షూటింగ్లో పాల్గొన్నటువంటి ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

గుంటూరు కారం సినిమా విషయంలో తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

ఈమె ఈ విషయాలను వెల్లడించడంతో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యారని తెలుస్తోంది.

ఇక మరొక హీరోయిన్ పాత్రలో శ్రీ లీల( Sreeleela ) నటిస్తున్న సంగతి తెలుస్తుంది.

స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్!