దేశంలో టాలెంట్ ఉన్నా కుటుంబ పరిస్థితుల వల్ల, ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందుల వల్ల ఉన్నత స్థాయికి చేరుకోని వాళ్లు చాలమందే ఉన్నారు.అయితే అదే సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాలను సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న వాళ్ల సంఖ్య తక్కువేం కాదు.
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించుకున్న రీతు కరిధాల్( Ritu Karidhal ) ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.
చంద్రయాన్ 3 కు( Chandrayaan 3 ) మిషన్ డైరెక్టర్ గా పని చేసిన ఈమె సక్సెస్ స్టోరీ వింటే మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది.
యూపీలోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.బాల్యం నుంచే అంతరిక్షంపై ఎంతో ఆసక్తి ఉన్న రీతూను ఎన్నో ప్రశ్నలు వేధించేవి.ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానం తెలుసుకోవడం కోసం రీతూ తన వంతు ప్రయత్నం చేసేది.
రీతూకు కెరీర్ తొలినాళ్లలో కోచింగ్ కు వెళ్లడానికి అవసరమైన డబ్బులు కూడా తనతో లేవు.ఇస్రోలో( ISRO ) పని చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఎంతగానో కష్టపడ్డారు.ఐ.ఐ.ఎస్.సీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన రీతూ 1997లో ఇస్రోలో చేరారు.మిషన్ ఎనాలసిస్ డివిజన్ లో తొలి జాబ్ చేసిన రీతూ మ్యాథ్స్, ఫిజిక్స్ పై ఉన్న ఆసక్తి వల్ల టాస్క్ లను సులువుగా పూర్తి చేశారు.
రీతూ కరిధార్ మంగళ్ యాన్ మిషన్ కు( Mangalyaan ) డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ గా, చంద్రయాన్ 2 కు మిషన్ డైరెక్టర్ గా పని చేశారు.ఇస్రోలో టాలెంట్ ముఖ్యమని లింగ వివక్షతకు ఇక్కడ తావు లేదని ఆమె అన్నారు.పని ఒత్తిడిని కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారని ఆఫీస్ లోనే నిద్రపోయిన రోజులు సైతం ఉన్నాయని ఆమె వెల్లడించారు.