రణ్‌వీర్ సింగ్ నగ్న ఫోటోల వివాదం.. ఎంట్రీ ఇచ్చిన చిన్మయి.. మాములుగా తిట్టలేదుగా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ షేర్ చేసుకున్న నగ్న ఫోటో గురించి ఇంకా టాక్ నడుస్తూనే ఉంది.ఇక ఈయన షేర్ చేసుకున్న నగ్న ఫోటో పై సెలబ్రెటీలు ఆయన గట్స్ ని మెచ్చుకుంటే కొందరు మాత్రం దారుణంగా తిట్టిపోస్తున్నారు.

 Singer Chinmayi Sripada Slams Those Who Filed Fir Against Ranveer Singh Photosho-TeluguStop.com

ఇలాంటి ఫోటోలు ఎందుకు పెడుతున్నారు అంటూ.సమాజంని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

ఇదే కాకుండా ఈయనపై ఓ ఎన్జీవో కేసు కూడా పెట్టింది.ఇక ఈ విషయం గురించి తాజాగా చిన్మయి ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ లో కొన్ని వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలియని వారే లేరని చెప్పాలి.ఎందుకంటే తన గొంతుతో చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ముక్కుసూటి మనిషిగా నిలిచింది.

సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఎక్కువగా సమాజంలో జరిగే వ్యతిరేకత కు బాగా స్పందిస్తుంది.

సమాజంలో జరిగే అన్యాయాల గురించి, మహిళలపై, అమ్మాయిలపై జరిగే దాడుల గురించి బాగా స్పందిస్తుంది.నిజానికి ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రతి ఒక్కరి బాధలను తెలుసుకొని వాటికి స్పందిస్తుంది.ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు ఆమెకు తమ బాధలు గురించి చెబుతూ తమపై ఉన్న భారాన్ని తగ్గించుకున్నారు.

Telugu Ranveer Singh, Ranveersingh-Movie

అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.అందులో చాలా మంది కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాల గురించి, హెల్త్ టిప్స్ ల గురించి అడిగి సలహాలు తెలుసుకుంటారు.హెల్త్ విషయంలో, బ్యూటీ విషయంలో కూడా నిత్యం ఏదో ఒక టిప్ చెబుతూనే ఉంటుంది చిన్మయి.నిజానికి చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి అండగా ఉందనే చెప్పవచ్చు.

ఇక కొందరు మాత్రం ఈమెను బాగా ట్రోల్స్ చేస్తారు.

చాలా వరకు ఆమె ను టార్గెట్ చేసి ఆమెకు ప్రైవేట్ పార్ట్ ల ఫోటో లను కూడా పంపిస్తూ ఉంటారు.

అయినా కూడా చిన్మయి అలా టార్గెట్ చేసేవారి గురించి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేది.తిరిగి వారికి తన స్టైల్లో సమాధానమిస్తూ వారిని ముఖం చాటేసుకునేలా చేస్తుంది.

తనకు ఎవరైనా బూతు మాటలతో కామెంట్లు చేస్తే మాత్రం ఆ మాట తిరిగి వాళ్ళకే తగిలేలా చేస్తుంది.

Telugu Ranveer Singh, Ranveersingh-Movie

ఇక ఈమె సోషల్ మీడియాని ఎక్కువగా జరిగే అన్యాయాలపై వాదించడానికి, వాటి సలహాలు ఇవ్వడానికి కోసమే ఎక్కువగా ఉపయోగిస్తుంది.తక్కువ సందర్భాల్లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా రణవీర్ సింగ్ చేసిన ఫోటో వివాదం మీద కౌంటర్ వేసింది చిన్మయి.

ఈ కేసు వేసిన మహిళకు అసలు బుద్ధి ఉందా.పనీపాట లేదా.ఇలాంటి వేస్ట్ కేసులు వేసి.న్యాయస్థానం టైంను వేస్ట్ చేస్తున్నారు.

దానికి బదులు రేప్ చేసిన ప్రజా ప్రతినిధులకు ఎలా రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని కేసులు వేయొచ్చు కదా.మహిళలను వేధించే ఎంపీలు, ఆడవాళ్ళ మధ్యలో డాన్సులు వేసే సీఎంల మీద ఫిర్యాదులు చేయొచ్చు కదా.ఓ ఇదంతా అటెన్షన్ కోసం.మహిళలు, వారి రక్షణ కోసం ఇదంతా చేయలేదు అంటూ కౌంటర్లు వేసింది.

ప్రస్తుతం ఆమె చేసిన కౌంటర్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube