తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.అమెరికా వీసా స్టాంపింగ్ కోసం ఢిల్లీకి వెళ్తున్నారని బండి సంజయ్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
అయితే హస్తిన పర్యటనలో భాగంగా బండి సంజయ్ బీజేపీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు చేశామని బీజేపీ నేతలు పేర్కొన్నారు.కాగా బీజేపీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.