వచ్చే ఎన్నికలపై బిఆర్‌ఎస్( BRS ) గట్టిగా దృష్టి పెట్టింది.ఈసారి కూడా ఎలాగైనా అధికారం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది.
అందుకే ప్రతివిషయంలోనూ కేసిఆర్( CM KCR ) ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.సీట్ల విషయంలోనూ అలాగే నియోజిక వర్గాల వారీగా పార్టీ బలోపేతం విషయంలోనూ ఇలా ప్రతిదాంట్లో కూడా ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
కాగా ఈసారి ఎన్నికల్లో 90 నుంచి 100కు పైగా సీట్లు సాధించాలనే టార్గెట్ తో ఉంది బిఆర్‌ఎస్ పార్టీ.ఆ రేంజ్ సీట్లు సాధించాలంటే అంత తేలికైన విషయం కాదు.

119 అసెంబ్లీ స్థానాలకు గాను అధికారం సాధించాలంటే 60 సీట్లు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.ఈసారి కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు కూడా కొంత బలంగానే ఉన్నాయి.ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ నిర్దేశించుకున్న 100 సీట్ల టార్గెట్ రిచ్ కావాలంటే ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది.ఇప్పటికే సీట్ల విషయంలో ప్రజా మద్దతు ఉన్నవారికే ప్రదాన్యత అని కేసిఆర్ కుండబద్దలు కొట్టారు.
నియోజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఏ మాత్రం ప్రజా వ్యతిరేకత ఉన్న వారికి సీట్ ఇచ్చే ప్రసక్తే లేదని కేసిఆర్ చెప్పకనే చెబుతున్నారు.దీంతో ఇప్పటికే చాలమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు( Sitting MLAs ) టికెట్ల భయం పట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సిఎం కేసిఆర్ ఝలక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అలాగే ఇప్పటివరకు నియోజిక వర్గాల వారీగా చేయించిన సర్వేలలో 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.దాంతో వరీనందరిని నిర్మొహమాటంగా పక్కన పెట్టి వారి స్థానంలో కొత్తవారిని బరిలోకి దించే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఆస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడితే.
వారినుంచి అసంతృప్తి జ్వాలలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.మరి కేసిఆర్ వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు రెడీ చేస్తారో చూడాలి.
మొత్తానికి గెలుపు కోసం ప్రతి విషయంలోనూ నో కంప్రమైజ్ అంటున్న బిఆర్‌ఎస్ కు.ఈ సారి తెలంగాణ ప్రజలు ఎలాంటి ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.