ఆ హీరో అంటే బెదిరిపోతున్న నిర్మాతలు.. అడ్వాన్స్ పోయినా పర్లేదు సినిమా లైట్ తీసుకుందాం అంటూ?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలను ఎక్కువగా వేధిస్తున్న ప్రశ్న థియేటర్లకు జనాలు ఎందుకు రావడం లేదు? అయితే ఈ విషయం పట్ల దర్శక నిర్మాతలకు తాజాగా విడుదలైన రెండు సినిమాలతో క్లారిటీ వచ్చింది.

తాజాగా విడుదలైన బింబిసారా, సీతారామం సినిమాల ఫలితాలు ఈ విషయంలో ఒక క్లారిటిని ఇచ్చాయి.

నిర్మాతలు కూడా ఇక తదుపరి సినిమాలు ఏ విధంగా ఉండాలి అన్న విషయంపై ఒక క్లారిటీని తెచ్చుకున్నారు.హీరోలకు కోట్లకు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం కంటే ఆ హీరోతో చేసే సినిమా కంటెంట్ ఏ విధంగా ఉన్నది.

అన్న విషయాన్ని పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాతనే ముందుకెళ్లడం మంచిది అని సీనియర్ నిర్మాతలు సూచించారు.అయితే ఈ మధ్యకాలంలో నిర్మాతలకు దెబ్బలు ఎదురు దెబ్బలు తిన్నారు కాబట్టి ఈసారి ప్రతీ నిర్మాత కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే అవకాశం ఉంది.

ఇక హీరోల పరంగా చూసుకుంటే కొంత మంది స్టార్ హీరోలు ఇప్పటికే కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటు ఎంపిక చేసుకునే కథలో కొత్తదనంతో పాటు కమర్శియల్ అంశాలు కూడా ఉండేలా చూసుకుంటున్నారు.కానీ ఆ ఒక్క హీరోలో మాత్రం ఇంకా ఇసుమొత్తు కూడా మార్పు రాలేదని ఇటీవల రిలీజ్ అయిన రెండు సినిమాల ఫలితాలతోనే అర్ధమవుతుంది.

Advertisement

మరి ప్రస్తుతం ఆ హీరో పరిస్థితి ఏంటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.అయితే ప్రస్తుతానికి పర్వాలేదు.

కాగా ఆ హీరో చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి.

కానీ ఆ నిర్మాతల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెట్టిస్తున్నాడని సమాచారం.చాలా మంది నిర్మాతలు హీరోని నమ్మే సినిమా చేస్తారు.కాస్త విషయం ఉన్న నిర్మాత అయితే దర్శకుడి ని నమ్మి ముందుకెళ్తాడు.

కానీ గత రెండు పరాజయాల నేపథ్యంలో ఆ రెండు అంశాలన్ని నమ్మి ఆ హీరోతో ముందుకెళ్దామన్నా? టెన్షన్ మొదలైందిట.కోట్ల రూపాయలు పెడుతున్నాం తేడా? వస్తే జరిగితే పరిస్థితి? ఏంటి అన్న ఆలోచన ఇప్పటి నుంచే మొదలైందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు