నందమూరి నటసింహం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’( Bhagwant Kesari )గా రాబోతున్నాడు.నిన్ననే ఈయన నటిస్తున్న 108వ సినిమా నుండి అప్డేట్ వచ్చింది.
టైటిల్ ను మాసివ్ లెవల్లో ప్రకటించారు మేకర్స్.బాలకృష్ణ జూన్ 10న తన పుట్టిన రోజును జరుపుకోనున్న నేపథ్యంలో ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా బాలయ్య( Balayya ) బర్త్ డే ట్రీట్ రెండు రోజుల ముందు నుండే స్టార్ట్ అయ్యింది.
జూన్ 10న బర్త్ డే అయితే జూన్ 8నే టైటిల్ అనౌన్స్ చేసి రెండు రోజులు ముందుగానే సందడి స్టార్ట్ చేసారు.మరి బర్త్ డే రోజు ట్రీట్ మరింత అదిరిపోతోంది అని అంటున్నారు.
బర్త్ డే రోజు భగవంత్ కేసరి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.మరి అందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్( Director Thaman ) కూడా ఫుల్ ప్రిపరేషన్స్ లో ఉన్నాడని తెలుస్తుంది.
ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి( Akhanda, Veerasimha Reddy ) వంటి సినిమాలకు నెక్స్ట్ లెవల్లో ఆల్బమ్స్ అందించిన థమన్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు.అఖండ సినిమాలో ఆర్ఆర్ కు బాగా పేరు రావడంతో ఇప్పుడు మరింత బాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారు.టీజర్ తోనే ఆర్ఆర్ పనితనం చూపించాలని థమన్ ఫిక్స్ అయ్యాడు.థమన్ కు లైవ్ ఆర్కెస్ట్రా అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే.ఆర్ఆర్ కు ఇలాగె ఈయన వాడుతారు.అయితే మొదటి సారి బాలయ్య సినిమా కోసం ఏకంగా 72 మందితో లైవ్ ఆర్కెస్ట్రా నిర్వహించాడని.
నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఆయనకు సై అన్నారని తెలుస్తుంది.
మరి ఈ టీజర్ కోసం ఇంత మంది పని చేసారంటే ఎలా ఉంటుందో ఎన్ని స్పీకర్స్ బద్దలు అవుతాయో అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.చూడాలి అనిల్ రావిపూడి మేకింగ్, థమన్ పడ్డ కష్టం, నిర్మాతల ఖర్చు ఈ టీజర్ లో ఎంతమేర కనిపిస్తాయో.