హీరోయిన్ సంఘవి వల్ల హీరో విజయ్ ఎందుకు చివాట్లు తిన్నాడో తెలుసా ?

అలనాటి స్టార్ హీరోయిన్ ఆరతికి మనవరాలిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ సంఘవి.తొలుత తమిళ సినిమా పరిశ్రమ ద్వారా నటిగా తెరంగేట్రం చేసిన సంఘవి అమరావతి అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

 Why Vijay Scolded Heroine Sanghavi , Sanghavi ,vijay,srikanth,taj Mahal Movie,ch-TeluguStop.com

తమిళంలో కొన్నాళ్లపాటు హీరోయిన్ గా చలామణి అయి ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో శ్రీకాంత్ కి హీరోయిన్ గా తెలుగులో డెబ్యూ చేసింది.నాటిక అవకాశం తమిళ చిత్ర పరిశ్రమలో అయినా కూడా ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమ అక్కున చేర్చుకుంది.

దాదాపు పది ఏళ్ళ కాలంలో 95 సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంఘవి 45 చిత్రాలు తెలుగులోనే నటించడం విశేషం.

Telugu Child Artist, Sanghavi, Sinduram, Srikanth, Suresh Verma, Taj Mahal, Vija

మైసూర్ లో పుట్టి పెరిగిన సంఘవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది.తెలుగులో సింధూరం ఆమెకు తిరుగులేని స్టార్ డం ను కల్పించడమే కాదు కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.కెరియర్ ముగిసిపోతున్న సమయంలో రాజశేఖర్ సినిమా శివయ్య కు దర్శకుడు అయినా సురేష్ వర్మ ని ప్రేమించి పెళ్లాడింది.

ఈ జంటకు ఓ కుమార్తె కూడా ఉంది.పెళ్లయిన తర్వాత టీవీ రంగంలో రీఎంట్రీ ఇచ్చింది కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.

Telugu Child Artist, Sanghavi, Sinduram, Srikanth, Suresh Verma, Taj Mahal, Vija

అసలు విషయంలోకి వెళితే… తమిళంలో సినిమాల్లో నటిస్తున్న తొలినాళ్లలో విజయ్ తో ఎక్కువగా నటించింది.వీరి కాంబినేషన్లో రాసిగన్, విష్ణు, కోయంబత్తూర్ మాపిలై, నిలవే వా వంటి సినిమాలు విడుదలై ఘనవిజయాన్ని సాధించాయి.దాంతో వీరి కాంబినేషన్ కి తమిళనాడులో మంచి క్రేజ్ ఉండేది.ఇక విష్ణు సినిమా షూటింగ్ సమయంలో అనుకోని ఒక సంఘటనలో విజయ్ చేతుల్లో సంఘవి చివాట్లు పడాల్సి వచ్చిందట.

నడుం లోతు నీళ్లలో దిగి డాన్స్ చేయాల్సి ఉండగా సంఘవి చాలా డేర్ గా దిగేసి విజయ్ కోసం ఎదురుచూస్తుందట.కానీ నీళ్ళు చలిగా ఉండడంతో విజయ్ లోపలికి దిగడానికి భయపడతాడట.

ఈ సినిమా దర్శకుడైన విజయ్ తండ్రి కే చంద్రశేఖర్ విజయ్ పై కోప్పడ్డాడట ఆడపిల్ల సంఘవి దిగింది నీకేంటి ప్రాబ్లం అంటూ అరిచాడట.ఇక షూటింగ్ జరిగిన తర్వాత విజయ్ సంఘవి వల్లే తిట్లు పడ్డాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube