మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
త్వరలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.అయితే లైగర్ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి తాజాగా స్పష్టత వచ్చింది.
ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించిన విసురెడ్డి లైగర్ ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.
ఆలస్యంగానే లైగర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఆయన కామెంట్లు చేశారు.లైగర్ మూవీ థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ఈ సినిమా ఓటీటీ మూవీ కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రాదని ఆయన కామెంట్లు చేశారు.
మరోవైపు లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాతలలో ఒకరు కావడం అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.అయితే సినిమాలో సత్తా ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లైగర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది.ప్రస్తుతం థియేటర్లలో సీతారామం, బింబిసార, కార్తికేయ2 సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయని సమాచారం.లైగర్ సినిమా విడుదలైతే ఈ సినిమాలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది.
లైగర్ మూవీ ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి.