సాయిబాబా అనుగ్రహం పొందాలంటే ఇవి పఠించాల్సిందే..!
TeluguStop.com
గురువారం అనగానే గుర్తొచ్చే దేవుడు సాయిబాబా.ఆ రోజు షిర్డీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.
తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల నమ్మకం.అందుకే చాలా మంది ప్రతీ గురువారం బాబాకు ప్రత్యేక పూజలు చేస్తూ.
ఉపవాసాలుంటారు.అంతేకాకుండా సాయిబాబా అష్టకాన్ని లేదా సాయిబాబా ఏకాదశ సూత్రాలను పఠిస్తే.
ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా మనం కోరిన కోరికలతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందంటారు.
H3 Class=subheader-styleశ్రీ సాయిబాబా అష్టకం./h3p
పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2
జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3
సాక్షాత్ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్ ముఖాత్
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4 """/" /
యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5
నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాథం నమామితాం 6
ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7
సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం 8
H3 Class=subheader-styleసాయిబాబా ఏకాదశ సూత్రాలు.
/h3p """/" /
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
ఈ భౌతిక దేహానంతరము సైతం నేనప్రమత్తుడను.నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడును.
నా సమాధినుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.నా సమాధినుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణు జొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము.
నాయందెవరికి ద్రుష్టిగలదో వారి యందే నా కటాక్షము గలదు.మీ భారములను నాపై బడవేయుడు.
నేను మోసెదను.నా సహాయమును కానీ, నా సలహానుగాని, కోరిన తక్షణమే నొసంగ సంసిద్ధుడను.
నా భక్తుల ఇంట 'లేమి' అను శబ్దము పొడచూపదు.
వైట్ హౌస్ గార్డెన్స్‌ను చూసే ఛాన్స్.. సందర్శకులకు గుడ్‌న్యూస్ చెప్పిన మెలానియా ట్రంప్!