కాంతార సీక్వెల్ పై అవాక్కయ్యే విషయం చెప్పిన రిషబ్ శెట్టి

గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా( Kantara ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.చిన్న బడ్జెట్‌ సినిమా గా రూపొంది ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించిన కాంతార సినిమా మేకర్స్ నుండి మరో భారీ కాంతార రాబోతున్న విషయం తెల్సిందే.కాంతార సినిమా లో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన రిషబ్‌ శెట్టి( Rishab Shetty ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 Kannada Movie Kantara Sequel Interesting Update,kantara,,rishab Shetty,kantara S-TeluguStop.com

కాంతార సినిమా యొక్క రెండవ భాగం మీరు గత ఏడాది చూశారు.ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కాంతార యొక్క మొదటి భాగం.ఈ సినిమా లో మరింత వివరంగా కొన్ని విషయాలను చూపించబోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

Telugu Kantara, Kantara Budget, Kantara Sequel, Kgf Makers, Rishab Shetty-Movie

ఇది ముందస్తుగా అనుకున్నది కాదు.కానీ కాంతార సినిమా సూపర్‌ హిట్ అవ్వడంతో సీక్వెల్‌ కథ( Kantara Sequel ) సాధ్యం కాదు కనుక ప్రీ క్వెల్‌ కథ ను తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.కాంతార సినిమా స్థాయి లో రాబోయే కాంతార వసూళ్లు( Kantara Movie Collections ) చేస్తే చాలా గొప్ప విషయం అన్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కాంతార గురించి ఎదురు చూస్తున్నారు.ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన కాంతారా ను 2024 సంవత్సరం లో ప్రేక్షకలు ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.

Telugu Kantara, Kantara Budget, Kantara Sequel, Kgf Makers, Rishab Shetty-Movie

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను కేజీఎఫ్( KGF ) ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తున్నారు.మొదటి కాంతారా కు ఖర్చు చేసిన మొత్తం తో పోల్చితే ఇప్పుడు రూపొందబోతున్న కాంతారా కు పెట్టబోతున్న ఖర్చు దాదాపుగా పది రెట్లు ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు కన్నడ సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాంతార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ముందు ముందు మరిన్ని కాంతార తరహా సినిమాలు వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube