రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస ఓటములతో దాదాపు ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకుంది.బ్యాటింగ్ , బౌలింగ్ లో బాగానే రాణిస్తున్న మ్యాచ్ లో ఎక్కడో ఒకదగ్గర పట్టు కోల్పోయి మ్యాచ్ లు ఓటమి పాలవుతున్నారు.
ఇకపోతే ముంబై ఇండియన్స్ వరుసగా విజయాలు సాధించి పాయింట్ ల పట్టిక లో టాప్ 4 జట్లలో ఒక జట్టు గా ఉంది.ఈ మధ్య సాధించిన విజయాలతో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు.చివరి ఓవర్లలో జట్టు కోసం ధాటిగా ఆడి ఒకవైపు పరుగులు చేస్తూ మరోవైపు బౌలింగ్ లో కూడా వికెట్ లు తీస్తున్నాడు.
1)ఇరు జట్ల మధ్య ఇప్పటు వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి
ముంబై కి రాజస్థాన్ కి మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్ లు జరగగా ముంబై 11 మ్యాచ్ లలో గెలవగా , రాజస్థాన్ 10 మ్యాచ్ లలో విజయం సాదించింది.ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది
ఈ మ్యాచ్ రాజస్థాన్ లో ని జైపూర్ లో జరగనుంది.ఇక్కడి పిచ్ పై బ్యాటింగ్ చేయడం సులభం , మొదట బ్యాటింగ్ చేసే జట్టు భారీగా పరుగులు చేయవచ్చు .రెండవ ఇన్నింగ్స్ లో పిచ్ నెమ్మదించి పరుగులు చేయడం కష్టమవుతుంది.టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.
3)రాజస్థాన్ జట్టు ఎలా ఉండబోతుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఎక్కువగా జోస్ బట్లర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.ఈ సీజన్ లో ఆ జట్టు గెలిచిన రెండు మ్యాచ్ లలో అతడు పాత్రే కీలకం.అతడు విఫలమైనపుడు జట్టు భారీ స్కోర్ లు చేయలేకపోతుంది.ఇక గత మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన రహానే నెమ్మిదిగా ఆడడం వల్ల మ్యాచ్ ని ఓడిపోవాల్సి వచ్చింది.
గాయం తో ఇబ్బంది పడుతున్న బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ లో అందుబాటులో ఉండకపోవచ్చు.బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ , శ్రేయస్ గోపాల్ , ధవాల్ కులకర్ణి లు రాణిస్తే ముంబై బ్యాటింగ్ ని కట్టడి చేయవచ్చు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – జొస్ బట్లర్ , రాహుల్ త్రిపాఠి , రహానే , స్టీవ్ స్మిత్ , సంజు శాంసన్ , ఆస్టన్ టర్నర్ , స్టువర్ట్ బిన్నీ , జోఫ్రా ఆర్చర్ , శ్రేయస్ గోపాల్ , ధవాల్ కులకర్ణి , మహిపల్ లోమ్రోర్
4)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై జట్టు వరస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందు కి వెళ్లాలనుకుంటుంది.ఆ జట్టు బ్యాటింగ్ ,బౌలింగ్ లో చాలా పటిష్టంగా ఉంది.ఒడిపోతుందన్న మ్యాచ్ లు కూడా గెలిచి చూపించే సత్తా ఉన్న ఆటగాళ్లు ఆ జట్టు సొంతం.ఇక ముంబై బౌలింగ్ లో రాహుల్ చహార్ , బుమ్రా , మలింగ లతో బలంగా ఉంది.
రాజస్థాన్ టాప్ ఆర్డర్ ని త్వరగా ఔట్ చేయగలిగితే ముంబై విజయం తేలిక అవుతుంది.గత మ్యాచ్ లో ఆడిన జట్టు తోనే ముంబై ఆడే అవకాశాలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) – రోహిత్ శర్మ , డి కాక్ , సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య , పొలార్డ్ , బెన్ కటింగ్ , రాహుల్ చహార్ , లసిత్ మలింగ , జస్పిరిత్ బుమ్రా
.