తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే.ఆయనకు ఏదైనా విషయంలో వ్యతిరేకం కనిపిస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతుంటాడు.
ఇదిలా ఉంటే తాజాగా జీవిత రాజశేఖర్ ల గురించి ఏకంగా గతాన్ని తవ్వాడు బండ్ల గణేష్.ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇందులో పలువురు నటులు పాల్గొని తమ ఒప్పందాలతో బాగా ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు.
ఇక ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పోటీ చేయడానికి ముందుకు రాగా ఇటీవలే ఆయనకు మద్దతు పలకడానికి సినీ నటి హేమ, జీవిత రాజశేఖర్ లు ముందుకు వచ్చారు.
ఇక ఈ విషయం గురించి ప్రకాష్ రాజ్ తెలియజేయగా.ఇదివరకే ప్రకాష్ రాజ్ టీమ్ లో ఉన్న బండ్ల గణేష్ బయటకు వచ్చాడు.పైగా అప్పటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతూ.తానే సొంతంగా మా ఎన్నికలకు పోటీ చేస్తానని రంగంలోకి దిగాడు.
ప్రకాష్ రాజ్ టీమ్ లో నుండి బండ్ల బయటికి రావడం కారణం అందులో పాల్గొన్న జీవిత రాజశేఖర్ అని చెప్పాలి.ఎందుకంటే బండ్ల గణేష్, జీవిత రాజశేఖర్ మధ్య కొన్ని వాదనలు ఉండటంతో.
ఆమె ఈ టీమ్ లో చేరడం తనకిష్టం లేదని అందుకే బయటకి వచ్చానని తెలిపాడు బండ్ల.తన అభిమాన నటులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను జీవిత రాజశేఖర్ గతంలో ఎన్నోసార్లు విమర్శించారని తెలిపాడు.
ఇక రాజశేఖర్ గతంలో ఈ స్టార్ నటులను విమర్శించిన వీడియోలను కూడా బయటపెట్టాడు బండ్ల.

గత ఎన్నికల తర్వాత డైరీ ఆవిష్కరణ సమయంలో చిరంజీవి, మోహన్ బాబు పై రాజశేఖర్ విమర్శలు చేసిన వీడియోలను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని నెగటివ్ చేసిన కామెంట్ల వీడియోలను మొత్తానికి బయటకి తీసి నెట్టింట్లో షేర్ చేస్తూ వారి గతాన్ని బయటకు వేస్తున్నాడు బండ్ల.ఇక వీరిపై మరింత ఫైర్ అవుతూ వీరిపై కొన్ని విమర్శలు చేస్తున్నాడు.