భారతదేశంలో టాలెంటుకి కొదువలేదు.ఇక్కడ రోజుకో ఇన్నోవేషన్ కి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ క్రమంలో కొందరు కారును హెలికాప్టర్‌గా తయారు చేస్తే, కొందరు స్ప్లెండర్ బండికి( Splendor Car ) బ్యాటరీని అమర్చి ఏకంగా ఎలక్ట్రిక్ బైక్‌లాగా తయారు చేస్తున్న ఘటనలు మనం చూసాం.అదేవిధంగా ఇప్పుడు స్ప్లెండర్ కి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అవును, ఈ వైరల్ వీడియోలో ఒక రైతు పాత బైక్‌తో ట్రాక్టర్‌ను తయారు చేశాడు.

ఈ ట్రాక్టర్( Tractor ) రైతులకు అనేక వ్యవసాయ పనులను ఇపుడు అత్యంత సులభతరం చేయడం గమనార్హం.బైక్‌తో తయారు చేసిన ఈ ట్రాక్టర్ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.బైక్ పై కాస్త ఖర్చు పెట్టి ట్రాక్టర్ తయారు చేశాడు ఈ రైతు.
ఆ వ్యక్తి బైక్ వెనుక టైరు తీసి దాని స్థానంలో నాగలిని అమర్చడం ఇక్కడ చూడవచ్చు.రెండు టైర్లను జతచేయటం ద్వారా, బైక్‌కు మినీ ట్రాక్టర్ ( Mini tractor )తయారైంది.
అంతే కాకుండా ఈ మినీ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతున్నపుడు ఎండతగలకుండా ఈ వ్యక్తి ట్రాక్టర్ పైన షెడ్డు కూడా వేసుకున్నాడు.

కాగా వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి పలువురు రైతులు అతని తెలివిని అభినందిస్తూ తమకి కూడా అలాంటి ట్రాక్టర్లు కావాలని కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ‘కృష్ణ కృషి యంత్ర’( Krishna Krishi Yantra ) అనే పేజీ ద్వారా ఇన్స్టాలో షేర్ చేయగా వెలుగు చూసింది.ఈ మినీ ట్రాక్టర్‌తో ఈ రైతు పొలం పనులు చేస్తున్న మరికొన్ని వీడియోలను కూడా మీరు ఈ పేజీలో చూడొచ్చు.
ఈ వీడియోలని చాలా మంది నెటిజన్లు లైక్ చేయడంతో పాటు రైతు తన వ్యవసాయం కోసం చేసిన ఈ అద్భుత ప్రయోగాన్ని నెటిజన్లు సైతం పొగడ్తలతో ముంచేస్తున్నారు.ఇతని దగ్గర చదువుకున్న ఇంజనీర్లు ఎందుకూ పనికిరారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







