సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ చాలా ఇబ్బందులు పడి మొత్తానికి సినిమా చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందుతారు.అలా ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం మంచి గుర్తింపు పొందుతున్న వాళ్లలో వెన్నెల కిషోర్( Vennela Kishore ) ఒకరు.
అయితే ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.అందుకే వెన్నెల కిషోర్ అంటే స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాల్లో అతన్ని పెట్టుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు.
అయితే గత కొద్ది రోజుల క్రితం వెన్నెల కిషోర్ రెండు రోజుల్లో 12 సినిమాల షూటింగ్స్ లో నటిస్తే ఆ 12 సినిమాల్లో కూడా ఆయనకు పెళ్ళికొడుకు గెటప్ చేయాల్సి వచ్చిందట నిజంగా ఇలాంటి అవకాశం రావడం విశేషమనే చెప్పాలి.ఏ సినిమా సెట్ లోకి వెళ్లిన ఆయన ఆ రెండు రోజులు అదే క్యారెక్టర్ చేశారు అంటూ ఒక వార్త చాలా హల్చల్ చేసింది.నిజానికి ఒక ఆర్టిస్ట్ ఇలా రెండు రోజులు మొత్తం ఒకే రకమైన షూటింగ్ చేయడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటా…ఇక నటుడు అంటే డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించాలి.కాబట్టి వేరే వాళ్లు ఒకే రకమైన పాత్రలను చేయడానికి ఇష్టపడరు.
కానీ వెన్నెల కిషోర్ మాత్రం ఒకే రకమైన పాత్ర చేసిన కూడా అందులో కామెడీ పాత్రలు చేస్తూనే, కామెడీ పెళ్లికొడుకుగా కూడా నటిస్తూ తనదైన రీతిలో హావభావాలను పలికిస్తూ మెప్పిస్తుంటాడు.అందుకే వెన్నెల కిషోర్ అంటే చాలా మంది ఆడియన్స్ కూడా ఇష్టపడుతు ఉంటారు…ఇక ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా ఆయన ఒక చిన్న రోల్ లో అయిన నటిస్తున్నాడు.