మనలో చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు( Fat ) భారీగా పేరుకుపోతూ ఉంటుంది.శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట మాత్రం బానలా మారుతుంది.
ముఖ్యంగా గంటలు తరబడి కూర్చుని పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.గంటల తరబడి కూర్చుని ఉండడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, కడుపు నింపుకోవడానికి ఏది పడితే అది తినడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం( Stress, alcoholism ) తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.
దాంతో ఊబకాయం బాధితులుగా మారతారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ ( Magical water )మీకు చాలా బాగా సహాయపడతాయి.ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తాగారంటే నెల రోజుల్లోనే పొట్ట కొవ్వు మాయమవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక నిమ్మ పండును( Lemon fruit ) తీసుకొని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలతో పాటు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( cumin
) , వన్ టేబుల్ స్పూన్ సోంపు( Anise ) వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తీసుకుంటే కనుక పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు మొత్తం ఐసు ముక్కలా క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.రోజు ఈ వాటర్ ను తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు.కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకునేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.