టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు.తెలుగు సినిమా స్టేటస్‌ను మరో మెట్టు ఎక్కించిన నటులలో చిరంజీవి తొలి వరసలో ఉంటాడనడంలో సందేహం లేదు.
ఇప్పటికీ ఈ హీరో అదిరిపోయే స్టెప్పులు, ఫైట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.మంచి కథలతో సినిమాలు తీస్తూ హిట్స్ కూడా అందుకుంటున్నాడు.
విశేష సేవలు అందిస్తున్నాడు కాబట్టే చిరంజీవి పట్ల సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయవేత్తల వరకు అందరూ గౌరవం చూపిస్తారు.కానీ యండమూరి వీరేంద్రనాథ్ అనవసరంగా చిరంజీవిపై నోరు పారేసుకుంటారు.
చిరంజీవి మాత్రం ఎవరేమనుకున్నా ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.
తనని మాటలన్న వారిని క్షమించి, అవకాశాలను కూడా అందిస్తుంటాడు.
రామ్ చరణ్ ను తిట్టిన యండమూరి వీరేంద్రనాథ్ కి( Yandamuri Veerendranath ) బయోపిక్ రాసే అవకాశం ఇచ్చి తన గొప్ప మనస్తత్వాన్ని చిరంజీవి చాటుకున్నాడు.అప్పుడే యండమూరికి చిరంజీవి గొప్పతనం తెలిసి వచ్చింది.
ఇక చిరు మంచి మనస్తత్వాన్ని మళ్ళీ అర్థం చేసుకొని అతని వద్దకు వచ్చి పశ్చాత్తాప భావాన్ని వ్యక్తం చేసిన వారు మరికొందరు ఉన్నారు.

వారిలో ఒకరు చిన్ని కృష్ణ.( Chinni Krishna ) చిరంజీవి ఇంద్ర సినిమాకి( Indra Movie ) స్టోరీ రైటర్‌గా చిన్ని కృష్ణ పనిచేశాడు.అయితే చిన్ని కృష్ణ గత సంవత్సరం ఏదో కారణం వల్ల చిరంజీవిపై దుర్భాషలాడాడు.
అయితే ఇటీవల చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు( Padma Vibhushan ) రావడంతో అభినందనలు తెలపడానికి ప్రత్యక్షంగా చిరును కలిశాడు.అనంతరం చిరంజీవిని అనవసరంగా తిట్టానని, తాను చాలా మంచి వాడిని, కొంతమంది తన చేత చిరును తిట్టించేలా చేశారని చిన్ని కృష్ణ వాపోయాడు.
చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి అని తాజాగా పొగుడుతూ తాను గతంలో అలా మాట్లాడినందుకు క్షమించమని కోరాడు.ఇంటికి వెళ్తే చిరంజీవి కొంచెం కూడా ద్వేషం చూపించలేదని, అది ఆయన గొప్పతనానికి ప్రతీక అని అతను చెప్పాడు.

ఇక గరికపాటి నరసింహారావు( Garikapati Narasimharao ) కూడా చిరంజీవిల ఫోటోలు సెషన్ ఆపేస్తే బాగుంటుందని, లేదంటే మైకు వదిలేసి ప్రసంగాన్ని ఆపేస్తానని గతంలో వ్యాఖ్యలు చేశారు.ఆ తర్వాత మళ్లీ ఉన్నత వ్యక్తిత్వం ఉన్న చిరంజీవిని అలా అనాల్సి ఉండకూడదని, దానికి తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.దీన్ని బట్టి చిరంజీవి శత్రువులను కూడా సిగ్గుతో తలదించుకునేలా చేస్తారని చెప్పుకోవచ్చు.