బాలయ్య బాబు ని వాడేసుకుంటున్న నాగబాబు ... ఈసారి ఏకంగా షార్ట్ ఫిల్మ్ తోనే

నందమూరి హీరో బాలకృష్ణ మీద మెగా బ్రదర్ నాగబాబు పీకల్లోతు కోపం పెంచేసుకున్నట్టున్నాడు.అంతే కాదు ఆ కోపం ఇప్పుడప్పుడే చల్లారేలా కూడా కనిపించడంలేదు.

 Nagababu Counter To Ballakrishna On A Short Film1-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో నాగ బాబు ఆపరేషన్ బాలయ్య అనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాడు.మొన్నామధ్య సోషల్ మీడియాలో బాలయ్యను ఉద్దేశించి… ఓ దున్నపోతు.

ఓ ఫిట్ బుల్ బ్రీడ్ డాగ్ పెట్టి వీటి బ్లడ్ .బ్రీడ్ వేరే అంటూ… కౌంటర్ వేసాడు.అలాగే గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ… ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా కడుపైనా చేయాలా’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ… ఇపుడు మెగా బ్రదర్ నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా ‘ఎర్రోడి వీరగాథ’ అనే షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

 Nagababu Counter To Ballakrishna On A Short Film1-బాలయ్య బాబు ని వాడేసుకుంటున్న నాగబాబు … ఈసారి ఏకంగా షార్ట్ ఫిల్మ్ తోనే …-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఎర్రోడి వీరగాథ’ అంటూ షార్ట్ ఫిల్మ్‌ని విడుదల చేయడం బాలయ్య అభిమానులను కలవరపెడుతోంది.మూడున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఓ వ్యక్తిని ఆడవాళ్లు పట్టుకుని చితక్కొట్టడం.వాళ్లని అడ్డుకుని ఇంతకీ ఎందుకు కొడుతున్నారు ఏమైందిరా? అని ఆ వ్యక్తిని నాగబాబు అడగడం.దానికి అతడు పెద్దోళ్లు చెప్పారు కదా.‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా కడుపైనా చేయాలా’ అని అందుకే ముద్దు అడిగా అందుకే కొడుతున్నారని ఆ వ్యక్తి చెప్పడం.దానికి షాకైన నాగబాబు ఆడవాళ్లను పిలిచి మరీ ఆ వ్యక్తిని చితక్కొట్టించడం లాంటి సీన్లు ఇందులో ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు