కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అధికార పీఠాన్ని సాధించాలని దిశగా బీజేపీ పావులు కదుపుతుండగా కాంగ్రెస్, జేడీఎస్ లు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.
అయితే ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ కర్ణాటకలో చేసే పోటీపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.కాగా గతంలోనే జీడీఎస్ తో కలిసి పని చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో బరిలోకి దిగనున్న బీఆర్ఎస్ మాజీ సీఎం కుమారస్వామితో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.