వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్న హీరోయిన్... సక్సెస్ అందుకోవడం కోసమేనా?

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venuswamy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన జాతకాలు చెబుతూ ఎంతో గుర్తింపు పొందారు.

 Heroine Performed Special Pooja With Venu Swami Is It For Success ,astrologer Ve-TeluguStop.com

అయితే సమంత( Samantha ) నాగచైతన్య ( Nagachaitanya )పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఈయన వీరు పెళ్లి చేసుకున్న విడిపోతారు అంటూ అప్పట్లోనే సమంత నాగచైతన్య జాతకం గురించి వెల్లడించారు.వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడాకులు( Divorce ) తీసుకొని విడిపోవడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య పెరిగిపోయింది.

ఈ క్రమంలోని వేణు స్వామి తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

Telugu Nidhi Aggarwal, Samantha-Movie

ఇకపోతే వేణు స్వామి ఎవరి జాతకంలోనైనా దోషాలు కనుక ఉంటే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం సెలబ్రెటీలు కూడా వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో రష్మిక మందన్న( Rakshmika ) వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయించారు.ఇదే విషయాన్ని వేణు స్వామి వెల్లడించారు.

అయితే తాజాగా నటి నిధి అగర్వాల్ ( Nidhi Aggarwal ) సైతం తన నివాసంలో వేణు స్వామి చేత ప్రత్యేక పూజలను చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Nidhi Aggarwal, Samantha-Movie

నిధి అగర్వాల్ వేణు స్వామి సమక్షంలో రాజా శ్యామల పూజ చేసినట్లు తెలుస్తోంది.ఇలా ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఈమె పింక్ కలర్ డ్రెస్ ధరించి వేణు స్వామి బృందం చెప్పిన విధంగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు.అయితే ఈమె ఏదైనా జాతక దోషం కారణంగా ఇలా పూజలు చేయించారా లేకపోతే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకొని స్టార్ సెలబ్రిటీగా కొనసాగడం కోసం పూజలు చేయించారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube