అమెరికాలో సంచలనం సృష్టించిన హెల్త్ కేర్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి అక్కడి కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.వివరాల్లోకి వెళితే.
కాలిఫోర్నియాకు చెందిన 56 ఏళ్ల కైన్ కుమార్‌కు సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా.యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఫిలిప్ గుటిరెజ్ మంగళవారం శిక్ష విధించారు.శిక్షాకాలంలో పునరావాస సమయంలో 5,09,365 డాలర్లు, ఆస్తుల జప్తు చేసి 4,94,900 డాలర్లుతో పాటు మరో 72,000 డాలర్లను జరిమానా విధించారు.
2019 ఏప్రిల్‌లో చోటు చేసుకున్న ఈ హెల్త్‌కేర్ స్కామ్‌కు సంబంధించి కుమార్‌పై చీటింగ్, చట్టవిరుద్ధంగా హైడ్రోకోడోన్ పంపిణీ కింద కేసులు నమోదు చేశారు.2011 ఫిబ్రవరి నుంచి 2016 మే వరకు మెడికల్ హెల్త్ కేర్ కార్యక్రమాన్ని కుమార్ దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది.అవసరం లేకపోయినప్పటికీ.
ఆరోగ్య సేవలను సూచించడం ద్వారా కుమార్ కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న హెల్త్ ఏజెన్సీ నుంచి లబ్ధి పొందినట్లుగా తేలింది.