మ్యాగీ నూడుల్స్‌ గురించి నిజం ఒప్పుకున్న కంపెనీ.. సుప్రీం ముందు మొత్తం క్లీయర్‌గా చెప్పేసింది, ఇక మీ ఇష్టం

పిల్లల నుండి పెద్దల వరకు అంతా కూడా ఆకలి అయ్యిందంటే నిమిషంలో తయారు అయ్యే నూడుల్స్‌ను ఆశ్రయిస్తారు.

ప్రతి ఒక్కరు సులభంగా చేయగల మ్యాగీ నూడుల్స్‌ గురించి గత మూడు నాలుగు ఏళ్లుగా వివాదం నెలకొంది.

నూడుల్స్‌లో నెస్లే సంస్థ సీసంను కలుపుతున్నట్లుగా పలు పరిశోదన సంస్థలు తేల్చాయి.దాంతో పలు రాష్ట్రాల్లో నెస్లే మ్యాగీ నూడుల్స్‌ను బ్యాన్‌ చేయడం జరిగింది.

దాంతో నెస్లే సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ స్టే తీసుకు వచ్చింది.ప్రస్తుతం సదరు సంస్థ సుప్రీంలో విచారణను ఎదుర్కొంది.

సీసం ఉన్న మ్యాగీ నూడుల్స్‌ను జనాలు ఎందుకు తినాలి అంటూ సుప్రీం దర్మాసనం నెస్లే సంస్థకు చెందిన లాయర్‌ను ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.మ్యాగీ నూడుల్స్‌లో సీసం ఉన్న మాట వాస్తవమే, కాని అది మోతాదుకు మించి లేదని, ఎంతైతే ఉండాలో అంతే ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Advertisement

ఎన్ని సంస్థలు, ఎంత మంది పరిశీలించినా కూడా నెస్లే మ్యాగీ నూడుల్స్‌లో సీసం మోతాదుకు మించి లేదు అంటూ తేలిందని, అందుకోసం మ్యాగీ నూడుల్స్‌కు క్లీన్‌ చీట్‌ ఇవ్వాల్సిందిగా నెస్లే తరపు న్యాయవాది కోరాడు.

నేస్లే నూడుల్స్‌లో సీసం ఉంది కాని, అది ప్రాణాంతకం ఏమీ కాదు అంటూ లాయర్‌ వాదించడం వింతగా ఉందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీసం ఎంత ఉన్నా కూడా ప్రాణాంతకమే, అది తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనే విషయం పక్కన పెడితే అది ప్రాణాంతకమైన విషం.తక్కువ మోతాదులో సీసం ఉన్నా కూడా మ్యాగీ రెగ్యులర్‌గా తినడం వల్ల ఆ సీసం ఎక్కువ పరిమాణంలో తీసుకున్నట్లే అవుతుంది కదా, అందుకే మ్యాగీ నూడిల్స్‌ను తినడం మానేస్తే ఉత్తమం అంటూ ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సుప్రీం కోర్టు కూడా మ్యాగీ నూడుల్స్‌ను బ్యాన్‌ చేస్తూ తీర్పు ఇవ్వాలంటూ కొందరు కోరుతున్నారు.

సుప్రీం కోర్టులో సంస్థకు చెందిన వారు స్వయంగా మ్యాగీలో సీసం ఉందని వెళ్లడి చేశారు.ఆ తర్వాత మీ ఇష్టం, ఇంకా కూడా నిమిషంలో అయ్యే మ్యాగీతో ఆకలి తీర్చుకోవాలనుకుంటే మీకర్మకు మీరే బాధ్యులు.మీరే కాకుండా మీ పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు