మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న మూవీ వినయ విధేయ రామ.ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకుడు కాగా, కైరా అద్వాని హీరోయిన్.
ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా కియరా అద్వాని మీడియాతో సినిమాకు, రామ్‌చరణ్‌కు సంబంధించిన సీక్రెట్ విషయాలను బయటపెట్టింది.
“రామ్ చరణ్ కు ఇన్‌స్టాగ్రామ్ అంటే చాలా ఇష్టం.ఆయనకీ సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది.కానీ చాలా మందికి ఆ విషయం తెలీదు” అని చరణ్‌కు సంబంధించిన సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది.ఈ విషయం తెలియగానే రామ్ చరణ్ కి ఇంస్టాగ్రామ్ ఏ పేరుతో ఉందో తెలుసుకోవాలని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు మెగా అభిమానులు.
ఇది ఇలా ఉండగా…వినయ విధేయ రామ సినిమా లో తన రోల్ గురించి కైరా మాట్లాడుతూ.” సినిమాలో నాకు, చరణ్‌కి మధ్య కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.నా క్యారెక్టర్ పేరు ‘సీత’.ఫ్యామిలీలో అందరి ముందు చాలా వినయంగా ఉంటూ, రామ్ ఏది చెప్తే అదీ అన్నట్టుగా ఉంటాను.బయట మాత్రం చాలా డామినేటింగ్‌గా ఉంటాను.మా కాంబినేషన్‌లో ఉండే సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.” అన్నారు.