దద్దరిల్లిన సిడ్నీ మైదానం..! పంత్‌పై ఫాన్స్ పాడిన ఈ పాట వింటే ఫిదా అవ్వాల్సిందే.!

టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్‌ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు.సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో అజేయ సెంచరీ (159) చేశాడు.

 Bharat Army Comes Up With A Rishabh Pant Song To Troll Aussie Fans1-TeluguStop.com

ఈ ఒక్క సెంచరీతో పంత్ ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా, 150కిపైగా పరుగులు చేసిన భారత కీపర్లలో నాలుగోవాడిగా రికార్డులకెక్కాడు.

అయితే, ఈ రెండు రికార్డులను తన తల్లి పుట్టిన రోజు నాడే సొంతం చేసుకోవడం విశేషం.

ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ బాది.ఆసీస్‌ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.

నోటితోనే కాదు బ్యాట్‌తోనూ బదులివ్వగలనని చాటి చెప్పాడు.

చివరి టెస్ట్‌ చూడటానికి మైదానానికి వచ్చిన భారత అభిమానులు అతనిపై ఓ అద్భుత పాటను రూపొందించి పాడారు.ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.పంత్‌-పైన్‌ స్లెడ్జింగ్‌ ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట లిరిక్స్‌.

“We’ve got Pant.Rishab Pant.I just don’t think you’ll understand.He’ll hit you for a six.He’ll babysit your kids.We’ve got Rishab Pant,” నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్‌.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube