ఏ చిత్ర పరిశ్రమ లో అయినా నటులు తమ తర్వాత తమ కొడుకుల్ని హీరోలు గా పరిచయం చేయాలనీ చూస్తారు అలాగే టాలీవుడ్ లో నందమూరి ఫామిలీ నుండి సీనియర్ ఎన్టీఆర్ వచ్చి ఎంత పెద్ద హీరో అయ్యారు మన అందరికి తెలుసు అలాగే అయన తర్వాత బాలకృష్ణ వచ్చి అగ్ర కథ నాయకుడు అయ్యాడు అలాగే వాళ్ళ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ పరమ్ పర ని కొనసాగిస్తున్నారు అలాగే అక్కినేని ఫామిలీ నుండి ANR, అయన తర్వాత నాగార్జున అయినా తర్వాత నాగ చైతన్య.అఖిల్ కూడా వచ్చారు.
అలాగే కృష్ణ గారి తర్వాత వాళ్ళ ఫామిలీ నుండి మహేష్ బాబు, చిరంజీవి ఫామిలీ నుండి రామ్ చరణ్ ఇలాగె వారసులు చాలామంది వచ్చారు అయితే ఒకప్పటి హీరొయిన్స్ కూడా మనం ఎమన్నా తక్కువ తిన్నామా అని వాళ్ళ నట వరసీమానుల్ని సినిమాల్లోకి దింపుతున్నారు.వాళ్ళు కూడా వీళ్ళలాగే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి అని చూస్తున్నారు.
వాళ్లలో మొదటగా ఒకపుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మి గారు ఆమె చాల సినిమాల్లో నటించి మెప్పించారు.ఆ తర్వాత కారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాల సినిమాల్లో చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు, ముఖ్యం గా నిన్నేపెళ్లాడుతా, మురారి మూవీలో తాను చేసిన అమ్మ పాత్ర కి మంచి గుర్తింపు లభించింది.అలాగే లాహిరి లాహిరి లాహిరి లో మూవీ లో ఆవిడా చేసిన విలన్ పాత్ర కి మంచి న్యాయం చేసారు.రీసెంట్ గా ఓ బేబీ లో బామ్మా గా చేసి సక్సెస్ అయ్యారు అయితే తన నట వారసురాలు అయినా ఐశ్వర్య ని కూడా హీరోయిన్ గా పరిచయం చేసారు ఆమె చాల సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందారు ఇప్పుడు ఆవిడా కూడా అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు త్రిష , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో చేసిన అకాశమంత మూవీలో త్రిష మదర్ గా చేసారు.
వేదవల్లి మాయ బజార్ మూవీలో ఒక మంచి పాత్ర చేసారు , ఆమె వారసురాలయిన జయలలిత ని కూడా ఇండస్ట్రీ లో పరిచయం చేసారు.ఆమె చాల తక్కువ టైం లోనే చాల పెద్ద హీరోయిన్ అయ్యారు.ఆమె హీరోయిన్ గా కాకుండా పొలిటికల్ గా కూడా బాగా రాణించారు.అప్పటి ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రం లో సీఎం అవ్వగా MJR తమిళ నాడు లో సీఎం అవ్వగా అనతి కాలం లోనే తాను కూడా సీఎం అయ్యింది.
సీఎం అయి తమిళనాడు జనాలకి సేవ చేసింది.తాను ఎంత గొప్ప లీడర్ అంటే తమిళనాడు మొత్తం ఇప్పటికి తనని అమ్మ అనే పిలుస్తారు.
అతిలోక సుందరి శ్రీదేవి కూడా టాలీవుడ్ టు బాలీవుడ్ అందరు అగ్ర హిరోలతో నటించింది.అప్పుడు తనకు చాల క్రేజ్ ఉండేది ఎంత క్రేజ్ అంటే శ్రీదేవి డేట్స్ ఇస్తేనే అగ్ర హీరో లు డేట్స్ ఇచ్చేవారు అంత పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి నట వారసురాలుగా వచ్చిన జాహ్నవి కపూర్ కూడా ఇండస్ట్రీ కి పరిచయం అయింది.తల్లి అందాన్ని పొందిన జాహ్నవి కపూర్ తన అభినయం తో ప్రేక్షకుల్ని మంత్ర ముగుదలని చేస్తుంది తన కంటూ సెపరేట్ ఫాన్స్ కూడా ఉన్నారు అయితే జాహ్నవి కపూర్ తెలుగు లో ప్రభాస్ తో సినిమా చేస్తుంది అంటూ పుకార్లు వచ్చాయి కానీ అది నిజం కాలేదు అలాగే జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ లో కూడా రామ్ చరణ్ పక్కన నటిస్తుంది అంటూ అప్పట్లో చాల పుకార్లు వచ్చాయి కాని ఏది నిజం అవ్వట్లేదు చూద్దాం మరి తాను తెలుగు లో ఎప్పుడు మూవీ చేస్తుందో.
జీవిత రాజశేఖర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు అంకుశం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.వాళ్ళకి ఇద్దరు కూతుళ్లు పెద్ద అమ్మాయి శివాని, చిన్న కూతురు శివాత్మిక.శివాత్మిక దొరసాని మూవీ లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాని మూవీ షూట్ నడుస్తుంది.
90వ దశకం లో ఎంత మంది హీరోయిన్స్ ఉన్న రాధా కి ఉన్న క్రేజ్ వేరే చాల మంది హీరోయిన్స్ నుండి వచ్చే పోటీ ని తట్టు కొని నిలబడగలిగిన హీరోయిన్ చిరంజీవి పక్కన అంతే గ్రేస్ తో డాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ రాధ ఆమె కి ఇద్దరు కూతుళ్లు పెద్దామె కార్తీక చిన్నామె తులసి.కార్తీక 2009 లో నాగార్జున కొడుకు నాగచైతన్య హీరో గా పరిచయం అయినా josh మూవీ లో తాను కూడా హీరోయిన్ గా పరిచయం అయింది అది యావరేజ్ ఆడిన నెక్స్ట్ మూవీ రంగం మూవీ మాత్రం ఇటు తెలుగు, అటు తమిళ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ కొట్టింది.తర్వాత ఎన్టీఆర్ తో దమ్ము మూవీ లో హీరోయిన్ గా చేసింది.తులసి మణిరత్నం చేసిన కడలి లో హీరోయిన్ గా చేసింది.
అలాగే శరత్ కుమార్ కూతురు అయినా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా హీరోయిన్ గా విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.రీసెంట్ గా హిట్ అయినా క్రాక్ మూవీ లో జయమ్మ పాత్ర లో జీవించిందనే చెప్పాలి.
అలాగే మేనకా అలనాటి హీరోయిన్ ఈమె చిరంజీవి పున్నమి నాగు సినిమా లో హీరోయిన్.అమే కూతురే కీర్తి సురేష్.ఈమె నేను శైలజ మూవీ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మహానటి తో నేషనల్ అవార్డు గెలుచుకుంది…తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది…
.