సమాజంలో మనుషుల ఆలోచనలు అతుకుల బొంతలుగా మారిపోతున్నాయి.వారి జీవన విధానం అస్తవ్యస్తంగా మారి చీడపురుగుల్లా జీవిస్తున్నారు కొందరు మనుషులు అని చెప్పుకునే కామాంధులు.
తల్లిదండ్రుల పెంపకంలో లోపమో, లేక వారి ఆలోచనల ఫలితమో తెలియదు గానీ ఈ నికృష్టుల చేష్టలు అసభ్యంగా మారి తోటి మనుషులకే కాదు చివరికి నోరు లేని మూగ జీవాలకు కూడా ప్రమాదంగా మారుతున్నాయి.
ఇకపోతే ఒక దరిద్రుడు కామంతో కళ్లు మూసుకుపోయి వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే.మైసూర్‌లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే 26 ఏళ్ల యువకుడు 11వ తారీఖున రాత్రి సమయంలో ఓ వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా చూసిన కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారట.
కాగా ఆ వీడియో పీపుల్ ఫర్ అనిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థకు చేరడంతో వారు వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారట.వెంటనే ఆ యువకునిపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేశారట.
ఇకపోతే సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న తెరమీదికి వచ్చేవి కొన్నే.అసలే మహిళలకు రక్షణ లేకుండా పోతున్న ఈ రోజుల్లో చివరికి జంతువుల పట్ల కూడా ఇలా ప్రవర్తించడం నీచం అని అంటున్నారట విషయం తెలిసిన వారు.