నటి బాత్రూమ్ లోకి వెళ్లిపోయిన అభిమాని.. చస్తానని బెదిరింపులు.. చివరికి?

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.

 Sonakshi Sinha Fan Threatens Her Khatra Khatra Show , Sonakshi Sinha , Fan , Kha-TeluguStop.com

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి సిన్హా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.సోనాక్షి సిన్హాకు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈమె కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే సోనాక్షి సిన్హా తాజాగా ఒక అభిమాని నుంచి ఊహించని అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ది ఖత్రా ఖత్రా షో లో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హా కు ఒక అభిమాని అతన్ని పెళ్లి చేసుకోవాలని, లేకపోతే గొంతు కోసుకుంటా అని బెదిరించాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏం జరిగిందంటే.సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్ లో తన మొబైల్ చూసుకుంటూ ఉండగా ఇంతలో ఒక వాష్ రూమ్ లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి మేడం నేను మీకు పెద్ద అభిమానిని మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు.

ఆ తర్వాత సోనాక్షి సిన్హా పేరును చేపచ్చబొట్టు వేసుకున్న చేతిని చూపించాడట.అనంతరం అక్కడే సోఫా లో కూర్చుని నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు.అంతేకాకుండా అద్దంపై లిప్ స్టిక్ తో ఐ లవ్ యు సోనా అని రాసి, దీని నా రక్తంతో కూడా రాయగలను అని సదరు అభిమాని సోనాక్షి తో చెప్పాడు.అయితే అదంతా అర్థంకాని సోనాక్షిసిన్హా అదేం వద్దు అన్నట్టుగా చేతులతో సైగ చేయడంతో ఆవేశానికి లోనై నా అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేస్తూ, జేబులో నుంచి కత్తి తీసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటారు అని సోనాక్షిని బెదిరించాడు.

షాక్ కు గురైన సోనాక్షి గట్టి గట్టిగా కేకలు వేయడంతో ఆ వీడియో అక్కడికి ముగిస్తుంది.అయితే ఇదంతా కూడా ది ఖత్రా ఖత్రా షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube