తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లు గా చెప్పుకునే ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచారనే చెప్పాలి… ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లు చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు కదిలారు.అలాగే వీళ్ళ నట వారసులు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక నాగేశ్వరరావు, నాగార్జున సినిమాలు చేస్తు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఆయన కొడుకుగా వచ్చిన నాగచైతన్య( Naga Chaitanya ) కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో రేసులో ముందుకు కొనసాగుతున్నడనే చెప్పాలి.ఇక ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో చేస్తున్న తండేల్ సినిమా( Tandel movie ) కేరళలో జరిగిన ఒక ఒరిజినల్ స్టోరీ ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద బజ్ పెంచే దానికి దర్శకుడు చంద్ మొండేటి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు ఆయన సంజయ్ దత్( Sanjay Dutt ) ను కూడా ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు.ఇక ఇది ఇలా పాటు ఇమ్రాన్ హష్మీ ని కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ తండేల్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఓజీ నటుడు అయిన ఇమ్రాన్ హష్మీ తండేల్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది…
.