యంగ్ హీరో నాగ శౌర్య చాలా రోజుల నుంచి ఒక కమర్షియల్ హిట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తో నెట్టుకొచ్చిన శౌర్య సోలోగా తనని మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
దీనికోసం తానే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్త దర్శకులు చెప్పిన కమర్షియల్ కథలతో సినిమాలు చేయడంతో పాటు తానే కథలు రాయడం మొదలు పెట్టాడు.అయితే తాను రాసిన కథలు విషయంలో వరుసగా డిజాస్టర్స్ వస్తున్నాయి.
ఎంతో నమ్మకాలు పెట్టి చేసిన అశ్వద్ధామ సినిమా కూడా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది.ఈ సినిమాలో నాగశౌర్య పూర్తిగా కొత్తగా కనిపించి మాస్ హీరోగా ఫైట్స్ కూడా చేశాడు.
అయితే ప్రేక్షకులు అతనిని రిసీవ్ చేసుకోలేకపోయారు.
ఇదిలా ఉంటే ఈ సారి మరింత కొత్తగా మారిపోయి పవర్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.
ఫుల్ గా గెడ్డం, 8 ప్యాక్ బాడీతో ఇప్పటికే ఫస్ట్ లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమాకి సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో శౌర్య విలువిద్య యోధుడుగా కనిపిస్తున్నాడు.ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గ స్టోరీ అయిన ఫుల్ పవర్ ప్యాక్ మాస్ యాక్షన్ కథాంశం అని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం పార్ధు అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదే టైటిల్ చాలా వరకు కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లు బోగట్టా.
ఇక ఈ సినిమాలో లుక్ కోసం శౌర్య వీలైనంత ఎక్కువ సమయం జిమ్ లోనే స్పెండ్ చేస్తున్నాడు.మరి భారీ హోప్స్ తో ఇప్పటి వరకు కనిపించని విధంగా శౌర్య చేస్తున్న ఈ సినిమా అతనికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది వేచి చూడాలి
.